B.Pharmacy Student Case : సత్యసాయి జిల్లాలో ఉద్రిక్తత-తేజశ్విని మృతదేహంతో బంధువుల ఆందోళన

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లిలో ఈరోజు సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది.  ఆత్మహత్య చేసుకుని మరణించిన బీ.ఫార్మశి విద్యార్ధిని తేజశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

B.Pharmacy Student Case : సత్యసాయి జిల్లాలో ఉద్రిక్తత-తేజశ్విని మృతదేహంతో బంధువుల ఆందోళన

Satya Sai District

Updated On : May 6, 2022 / 8:18 PM IST

B.Pharmacy Student Case : శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లిలో ఈరోజు సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది.  ఆత్మహత్య చేసుకుని మరణించిన బీ.ఫార్మశి విద్యార్ధిని తేజశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తేజశ్విని మృతదేహంతో ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కోంటున్న సాదిక్ ఇంటి వద్దకు చేరుకున్నారు.  తేజశ్విని మృతదేహాన్ని సాదిక్ ఇంటి ముందు  ఉంచి నిరసనకు దిగారు. వీరు వస్తున్నారని   సమాచారం తెలుసుకున్నసాదిక్   కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఎక్కడకో వెళ్లిపోయారు.

తేజశ్విని మృతేదేహానికి సాదిక్ ఇంటివద్దే అంత్యక్రియలు నిర్వహించేందుకు  ఆమె బంధువులు  ప్రయత్నించగా   పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో    తేజశ్విని బంధువులు   వాగ్వాదానికి దిగారు.  కొందరు సాదిక్ ఇంటి తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు, గ్రామస్తులతో కలిసి తేజశ్విని కుటుంబ సభ్యులకు, బంధువులకు సర్ధి చెప్పగా    చివరకు శాంతించారు. తేజశ్విని తండ్రి వ్యవసాయ పొలంలో తేజశ్విని అంత్యక్రియలు పూర్తి చేశారు.
Also Read : Roja On Selvamani Comments : మా ఆయన మాట్లాడిన మంచి మాటలను వక్రీకరించారు-మంత్రి రోజా