బాలికపై అత్యాచారం చేసిన హోంగార్డు

home guard raped by minor girl in hyderabad : హైదరాబాద్ పోలీసు శాఖలో పనిచేసే హోం గార్డు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో అడ్డగుట్టలో నివసించే మల్లికార్జున్(40) హోం గార్డుగా పని చేస్తున్నాడు. సీసీఎస్ లో డ్రైవర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మల్లి కార్జున్ కు అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. మాయమాటలతో బాలికను మభ్యపెట్టాడు.
ఒక రోజు బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని ఆమెను భయ పెట్టాడు. కాగా బాలికకు రెండురోజుల నుంచి ఆరోగ్యం సరిగా లేకపోవటంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా విషయం చెప్పింది.
తల్లి తండ్రులు తుకారాం గేట్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మల్లికార్జున్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి,అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.