Honour killing in kadapa district : కడప జిల్లాలో పరువు హత్య- పెళ్లైన కూతుర్ని చంపిన తండ్రి

Honour killing in kadapa district : కడప జిల్లాలో పరువు హత్య- పెళ్లైన కూతుర్ని చంపిన తండ్రి

Kdp Honour Killing

Updated On : March 15, 2021 / 11:31 AM IST

Honour killing in kadapa district, daughter killed by father, due to illegal affair : పెళ్లైన మహిళ భర్త ఉద్యోగ రీత్యా వేరే దేశాల్లో ఉంటే, భార్య ఇంటి దగ్గర వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త తిరిగి వచ్చాక విడాకులు కోరింది. దీంతో ఆగ్రహించిన ఆమె తండ్రి కన్నకూతురని కూడా చూడకుండా హత్య చేసిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని వేంపల్లె పట్టణం గాండ్ల వీధిలో నివసించే పోరుమామిళ్ల వనజారాణికి(29) గురువేంద్రతో 2009 లోవివాహం అయ్యింది. వీరికి ఒక కుమార్తె. కూతురు పూజిత మూడో తరగతి చదువుతోంది.

గురువేంద్ర ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన క్రమంలో వనజారాణి ప్రొద్దుటూరులో  ఉంటూ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కాగా ఈ ఏడాది జనవరిలో ఆమె భర్త గురువేంద్ర జనవరిలో ఇంటికి వేంపల్లె తిరిగి వచ్చాడు.

అప్పటి నుంచి తనకు భర్తనుంచి విడాకులు కావాలని..మరోకరిని పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. దీనిపై గత కొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. భర్త గురువేంద్ర వనజారాణి తల్లితండ్రులకు విషయం చెప్పాడు. వారు ఆమెకు నచ్చ చెప్పాలని చూశారు.

ఈ క్రమంలో శనివారం రాత్రి వనజారాణి తండ్రి రాజశేఖర్, చిన్నాన్న జనార్ధన్, మరోకరు ఆమెకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. వారెంత చెప్పినా ఆమె తన నిర్ణయం మార్చుకోలేదు.

దీంతో కోపం పెరిగిపోయిన ఆమె తండ్రి రాజశేఖర్ చున్నీని మెడకు చుట్టి ఆమెన హత్య చేశాడు. సమచారం తెలుసుకున్న పోలీసులు రాజశేఖర్ పైన మరో ఇద్దరిపైనా కేసునమోదు చేశారు. అల్లుడు వద్ద తమ పరువు పోతుందని…కుటుంబ పరువు బజారున పడుతుందని భయపడి రాజశేఖర్ ఈదారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.