Hyderabad : హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పైనుండి పడి ఒకరి మృతి, మరొకరికి గాయాలు

బైక్ పై వెనుక కూర్చున్న స్వీటీ పాండే ఒక్కసారిగా ఎగిరి ఫ్లైఓవర్ పైనుండి కింద రోడ్డుపై పడింది. Hyderabad Road Accident

Hyderabad : హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పైనుండి పడి ఒకరి మృతి, మరొకరికి గాయాలు

Hyderabad Road Accident (Photo : Google)

Updated On : August 17, 2023 / 11:41 PM IST

Hyderabad Road Accident : అతివేగం ప్రమాదకరం. ప్రాణాలకే ప్రమాదం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఇలాంటి స్లోగన్స్ ఎన్ని చెప్పినా, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా, కళ్ల ముందు ఘోర ప్రమాదాలు జరుగుతున్నా.. ఇంకా కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎలాంటి తప్పు చేయని అమాయకులు ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారు. అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ఎలాంటి ఘోర ప్రమాదాలు జరిగాయో, జరుగుతున్నాయో కళ్లారా చూస్తున్నాం. అయినా ఇంకా కొందరిలో మార్పు రాకపోడం బాధాకరం.

తాజాగా హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ ఒకరి ప్రాణం తీసింది. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు. మాదాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పైనుండి కింద పడటంతో ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి.

Also Read..Man Shot : షాకింగ్.. కూతురిని భుజాలపై మోసుకెళ్తున్న తండ్రి, ఇంతలో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి

కోల్ కతాకు చెందిన స్వీటీ పాండే(22) తన స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలిసి బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా, అజాగ్రత్తగా బైకు నడిపటంతో యాక్సిడెంట్ జరిగింది. బైక్ పై నియంత్రణ కోల్పోయిన రాయన్ ల్యూకే.. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ను ఢీకొట్టాడు. దాంతో బైక్ పై వెనుక కూర్చున్న స్వీటీ పాండే ఒక్కసారిగా ఎగిరి ఫ్లైఓవర్ పైనుండి కింద రోడ్డుపై పడింది. తీవ్రగాయాల పాలైంది. బైక్ నడుపుతున్న రాయన్ ల్యుకే ఫ్లైఓవర్ గోడను ఢీకొని గాయాలపాలయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వీటీ పాండే మృతి చెందింది. ఉదయం 4 సమయంలో JNTU నుంచి ఐకియా వైపు ఫ్లై ఓవర్ పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read..Beer : షాకింగ్.. కింగ్ ఫిషర్ బీర్‌లో నిషేధిత రసాయనం, తాగితే ప్రాణాలకే ప్రమాదం, వెంటనే అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశం