విజయవాడలో కలకలం : రూ.3 కోట్ల విలువైన బంగారం పట్టివేత
బంగారం అక్రమంగా తరులుతోంది. బిల్లులు ఎగ్గొట్టి.. దొంగమార్గంలో దుకాణాల్లోకి చేరుతోంది. తక్కువ ధరకే వస్తుండడంతో.. వ్యాపారులు కూడా ఈ

బంగారం అక్రమంగా తరులుతోంది. బిల్లులు ఎగ్గొట్టి.. దొంగమార్గంలో దుకాణాల్లోకి చేరుతోంది. తక్కువ ధరకే వస్తుండడంతో.. వ్యాపారులు కూడా ఈ
బంగారం అక్రమంగా తరులుతోంది. బిల్లులు ఎగ్గొట్టి.. దొంగమార్గంలో దుకాణాల్లోకి చేరుతోంది. తక్కువ ధరకే వస్తుండడంతో.. వ్యాపారులు కూడా ఈ దొంగ బంగారాన్ని కళ్లకు అద్దుకుని తీసుకుంటున్నారు. ముంబై కేంద్రంగా సాగుతున్న ఈ దందా.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పట్టణాలకూ పాకింది. తాజాగా విజయవాడలో ఇలానే అక్రమ మార్గంలో బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి సుమారు 3కోట్ల 18 లక్షలు విలవైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన దాదీ సేట్.. విజయవాడకు చెందిన శ్రీనివాస్ లు.. బంగారు ఆభరణాలకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా నగరానికి తరలిస్తునట్లు గుర్తించిన పోలీసులు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇటు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లోనూ ఓ ముఠా పట్టుబడింది. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లిలో 4 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. షెనాయ్ హాస్పిటల్స్ సమీపంలోని ఓ ఇంట్లో సోదాలు చేసిన DRI అధికారులు.. కారులో బంగారం ఉన్న బ్యాగ్‌ను గుర్తించారు. 4 కిలోల బంగారంతో పాటు 2 కోట్ల విలువైన బంగారం అమ్మకాలకు సంబంధించిన పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. క్యాలికట్ నుంచి ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇతర దేశాల నుండి దొంగతనంగా బంగారం తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు అధికారులు.
రెండు రోజుల క్రితం కడప జిల్లాలోనూ భారీగానే బంగారం పట్టుబడింది. నెల్లూరు వైపు నుంచి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో.. బంగారం బయటపడింది. ఓ కారులో… ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి మరీ బంగారాన్ని తరలిస్తున్నారు అక్రమార్కులు. ఎవరికీ అనుమానం రాకుండా.. సీటులోనే ప్రత్యేకంగా అర ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే నగలను దాచి దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో ఇలా సీటులో దాచిన సుమారు 7 కేజీల బంగారు నగలు బయటపడ్డాయి. వీటి విలువ మూడు కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ప్రొద్దుటూరులోని దుకాణాలను ఇలా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.