Kolkata : ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోందని భార్యను కడతేర్చిన భర్త
ఇటీవల కాలంలో సోషల్ మీడియా కారణంగా భార్యభర్తలు కీచులాడుకుంటున్నారు. భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, వీడియోలు పోస్టు చేస్తోందని ఆమె భర్త ఘాతుకానికి తెగబడ్డాడు.

Kolkata
Kolkata : సోషల్ మీడియా ఇటీవల భార్యభర్తల మధ్య చిచ్చుపెడుతోంది. భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్టు చేస్తోందని, అందరితో స్నేహాలు చేస్తోందని కక్ష పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా చంపిన ఘటన కోల్‌కతాలో జరిగింది.

Kolkata
ఇటీవల కాలంలో భార్యభర్తల మధ్య గొడవలకు సోషల్ మీడియా కూడా కారణమవుతోంది. రీల్స్ చేయడం, వీడియోలు చేయడం, సోషల్ మీడియా స్నేహాలు కారణంగా చాలామంది భార్యాభర్తలు తగవులాడుకుంటున్నారు. కోల్‌కతాలో పరిమళ బైద్య (38) అనే వ్యక్తి తన భార్య (35) అపర్ణ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని, అందరితో పరిచయాలు పెంచుకుంటోందనే అనుమానంతో దారుణంగా కడతేర్చాడు. హరినారాయణపూర్‌లో ఈ ఘటన జరిగింది.
Pranshu : ఇన్‌స్టా రీల్స్‌లో బ్యాడ్ కామెంట్స్ భరించలేక మేకప్ ఆర్టిస్ట్ ఆత్మహత్య
అపర్ణ తరచూ వీడియోలు, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండేది. అది నచ్చకపోవడంతో భర్త గొడవపడేవాడు. ఇటీవల ఇదే విషయంపై ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయిన భర్త అపర్ణ గొంతుకోసి హత్య చేసాడు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు 7 వ తరగతి చదువుతుండగా, కూతురు నర్సరీ చదువుతోంది. పరిమళ బైద్య తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఘటన జరిగినపుడు ఇద్దరు పిల్లలు ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. అపర్ణను హత్య చేసి పరారైన పరిమళ బైద్య కోసం పోలీసులు వెతుకుతున్నారు. హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Bigest Tip : రూ. 600లు బిల్‌కు రూ.6లక్షలు టిప్ ఇచ్చిన మహిళ .. తర్వాత తన డబ్బు ఇచ్చేయాలంటూ పోరాటం
రీల్స్ చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి అపర్ణ, పరిమళ బైద్య గొడవ పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆమె సోషల్ మీడియాలో ఎక్కువమంది స్నేహితులను సంపాదించడం, వారితో టచ్‌లో ఉండటం.. ముఖ్యంగా మనీ లెండింగ్ ఏజెన్సీకి చెందిన ఓ అధికారితో అపర్ణ మాట్లాడటం భర్త పరిమళ బైద్య సహించలేకపోయాడని వారు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరిమళ బైద్య ఆచూకీ కోసం వెతుకుతున్నారు.