Husband Killed Wife : భార్యను నరికి చంపిన భర్త
కట్టుకున్న భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. కుటుంబ కలహాలతో తాళి కట్టిన భార్యని, భర్త అతి కిరాతకంగా గొడ్డలితో నరికి కడతేర్చిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో జరిగింది.

Husband Killed Wife
Husband Killed Wife : కట్టుకున్న భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. కుటుంబ కలహాలతో తాళి కట్టిన భార్యని, భర్త అతి కిరాతకంగా గొడ్డలితో నరికి కడతేర్చిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో జరిగింది.
నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కేతం లింగయ్య అనే వ్యక్తి తన భార్య అయిన కేతం లక్ష్మీని గురువారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హతమార్చాడు. కుటుంబ కలహాలతోనే ఆమెను చంపినట్లు బంధువులు పేర్కొంటున్నారు.
నిందితుడు కేతం లింగయ్య జైపూర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. లింగయ్య..మృతురాలికి వేణు,రమేష్ ఇద్దరు కుమారులు రమాదేవి అనే ఒక కుమార్తె వున్నారు.. కుమారుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జైపూర్ ఏసీపీ నరేందర్ తెలిపారు.