Husband Kill Wife : ఒడిశాలో దారుణం.. అన్నం వండ‌లేద‌ని భార్యను కొట్టి చంపిన భర్త

సనాతన్ ధరువా ఆదివారం రాత్రి ఇంటికి వచ్చే సరికి భార్య కూర వండారు కానీ, అన్నం వండ లేదు. ఆకలితో ఉన్న సనాతన్ ధరువా ఆగ్రహంతో భార్యపై దాడి చేశాడు.

Husband Kill Wife : ఒడిశాలో దారుణం.. అన్నం వండ‌లేద‌ని భార్యను కొట్టి చంపిన భర్త

Husband Kill Wife

Updated On : May 9, 2023 / 9:45 AM IST

Husband Kill Wife : ఒడిశాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్నం వండ‌లేద‌నే కోపంతో భార్య‌ను భ‌ర్త‌ హ‌త్య చేశాడు. భార్యను కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం.. సాంబల్ పూర్ జిల్లా జమన్ కిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌధి గ్రామానికి చెందిన 40 ఏళ్ల సనాతన్ ధరువా తన భార్య పుష్ప ధరువా(35)తోపాటు కుమారుడు, కూతురుతో కలిసి ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో సనాతన్ ధరువా ఆదివారం రాత్రి ఇంటికి వచ్చే సరికి భార్య కూర వండారు కానీ, అన్నం వండ లేదు. ఆకలితో ఉన్న సనాతన్ ధరువా ఆగ్రహంతో భార్యపై దాడి చేశాడు. ఇద్దరు పిల్లలు ఇంట్లో లేకపోవడంతో భార్యను కొట్టి చంపాడు. కుమారుడు ఇంటికి వచ్చి చూసే సరికి తల్లి మృతి చెంది విగతజీవిగా పడి ఉన్నారు.

Wife Killed Husband : మద్యానికి బానిసై వేధిస్తున్న భర్తను హత్య చేసిన భార్య

దీంతో కుమారుడు పోలీసులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సనాతన్ ధరువాను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.