Pullaiah Arrest : ఎట్టకేలకు దొరికాడు.. 100 కోట్లతో ఉడాయించిన చిట్టీల పుల్లయ్య అరెస్ట్
కేసును ఫైల్ చేసుకున్న పోలీసులు పుల్లయ్య కోసం ప్రత్యేక బృందాలతో సెర్చింగ్ చేపట్టారు.

Pullaiah Arrest : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడిన పులయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరులో పులయ్యను అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని మధురానగర్, ఎస్ఆర్ నగర్ లో చిట్టీల పేరుతో పులయ్య భారీగా వసూళ్లు చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
వసూలు చేసిన డబ్బుతో పులయ్య గత నెల 27న పరారయ్యాడు. దీంతో బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. కేసును ఫైల్ చేసుకున్న పోలీసులు పుల్లయ్య కోసం ప్రత్యేక బృందాలతో సెర్చింగ్ చేపట్టారు. ఎట్టకేలకు పుల్లయ్య బెంగళూరులో పోలీసులకు చిక్కాడు.
చిట్టీల పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన చిట్టీల పుల్లయ్యను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన పుల్లయ్య డబ్బుతో పారిపోయాడు. పులయ్యను పట్టుకునేందుకు సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
అతడి స్వగ్రామంతో పాటు అన్ని చోట్ల గాలించారు. బెంగళూరులో అజ్ఞాత ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఉంటున్న పుల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంద కోట్లతో ఉడాయించిన చిట్టీల పుల్లయ్య ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దీంతో తమ డబ్బు తమకు ఇప్పించాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు.