పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం.. ఐటీ ఉద్యోగి నుంచి 2కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు, ఎలా మోసం చేశారంటే..

ఆ తర్వాత కస్టమర్ కేర్ సూచనలతో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాడు. మొదట బాగా లాభాలు వచ్చినట్లు యాప్ లో చూపించింది.

పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం.. ఐటీ ఉద్యోగి నుంచి 2కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు, ఎలా మోసం చేశారంటే..

Updated On : November 8, 2024 / 1:11 AM IST

Cyber Crime : తక్కువ పెట్టుబడితో ఎక్కువ మనీ సొంతం చేసుకునే ఛాన్స్. ట్రేడింగ్ చేయడం డబ్బులు సంపాదించండి. ఇలా డబ్బు ఆశ చూపి మొదటికే మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇన్వెస్ట్ మెంట్ పేరుతో మాయ చేస్తున్నారు. చిన్న చిన్న అమౌంట్ ఖాతాల్లోకి వేసి పెద్ద మొత్తాన్ని కాజేస్తున్నారు. ఎక్కడో కూర్చుని టెక్నాలజీ సాయంతో ఇట్టే మోసం చేసేస్తున్నారు. రోజుకో కొత్త ప్లాన్ తో డబ్బులు కొట్టేస్తున్నారు. ఇంతకీ సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్ ఏంటి? కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు ఎలా నమ్మిస్తున్నారు? తాజాగా వాట్సాప్ గ్రూప్ తో రూ.2 కోట్లు కొట్టేసిన సైబర్ క్రైమ్.. సంచలనంగా మారింది.

ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్, సంపన్నులే టార్గెట్. పెట్టుబడులు, కేవైసీ అప్ డేట్, డిజిటల్ అరెస్ట్ పేరుతో నమ్మించి మోసం చేసి, బెదిరించి అందినకాడికి దండుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని నమ్మించి.. ఖాతాల్లో సొమ్మును ఖాళీ చేస్తున్నారు. మొదట్లో పెట్టిన పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో లాభం వచ్చినట్లు ఆశ చూపి ఆ తర్వాత బాధితుల నుంచి కోట్లకు టోకరా వేస్తున్నారు. తాజాగా అలాంటి సైబర్ స్కామ్ హైదరాబాద్ లో వెలుగుచూసింది.

బాచుపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫోన్ నెంబర్ కొందరు సైబర్ నేరగాళ్లు కేఎస్ఎల్ అఫీషియల్ స్టాక్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేశారు. ఆ తర్వాత గ్రూపులో ఉన్న వారు కొటక్ ప్రో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని మేసేజ్ లు చేసే వారు. కొటక్ ప్రో యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేసి అధిక లాభాలు పొందుతున్నట్లు నమ్మించారు. ఇందులోనే వీఐపీ ట్రేడింగ్ ప్లాన్ లో చేరితే మరిన్ని లాభాలు వస్తాయని మోటివేట్ చేశారు. గ్రూప్ లో మేసేజ్ లను నమ్మిన సదరు ఐటీ ఉద్యోగి కొటక్ ప్రో యాప్ ను డౌన్ లోడ్ చేశాడు.

ఆ తర్వాత కస్టమర్ కేర్ సూచనలతో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాడు. మొదట బాగా లాభాలు వచ్చినట్లు యాప్ లో చూపించింది. ప్రాఫిట్స్ వస్తున్నాయని నమ్మిన ఐటీ ఉద్యోగి.. చాలాసార్లు యాప్ లో మనీ ఇన్వెస్ట్ చేశాడు. వస్తున్న లాభాలు నిజమే అని నమ్మాడు. వచ్చిన లాభం అమౌంట్ తో ఐపీవో షేర్లను కేటాయిస్తామంటూ సైబర్ నేరగాళ్లు నమ్మించారు. అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం ట్రాన్స్ ఫర్ చేయాలంటూ 2 కోట్ల 29 లక్షల రూపాయలను తమ ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు.

అంతటితో ఆగకుండా మరో కోటి 10 లక్షలు లాభం వచ్చినట్లు సైబర్ నేరగాళ్లు బాధితుడిని నమ్మించారు. ఆ మొత్తం అమౌంట్ ని అతడి యాప్ లో క్రియేట్ చేశారు. ముందు పంపిన రూ.2 కోట్ల 29 లక్షలు, కొత్తగా యాడ్ అయిన కోటి 10 లక్షలు.. మొత్తం ఒకేసారి డ్రా చేసుకోవాలంటే 40 లక్షలు చెల్లించుకోవాలని కండీషన్ పెట్టారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాప్ వాట్సాప్ గ్రూప్ లోని నెంబర్లపై దర్యాఫ్తు చేసిన పోలీసులకు ఇది.. సైబర్ క్రైమ్ గా తేల్చి చెప్పారు.

 

Also Read : ‘డిజిటల్ అరెస్ట్’తో తస్మాత్ జాగ్రత్త.. అనుమానం వస్తే వెంటనే రిపోర్టు చేయండి : నిపుణుల హెచ్చరిక!