Crime Report 2024 : భారీగా పెరిగిపోతున్న సైబర్, ఆర్థిక నేరాలు.. 2024 క్రైమ్ యాన్యువల్ రిపోర్ట్ విడుదల..
హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లో నిర్వహించిన సమావేశంలో 2024 యాన్యువల్ రిపోర్ట్ ను హైదరాబాద్ సీపీ ఆనంద్ విడుదల చేయగా, రాచకొండ కమిషనరేట్ కి సంబంధించిన క్రైమ్ వివరాలను సీపీ సుధీర్ కుమార్ వెల్లడించారు.

Crime Report 2024 : హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో క్రైమ్ రేట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్వల్పంగా పెరిగింది. కమిషనరేట్ల పరిధిలో నేరాల నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. రెండు కమిషనరేట్లలో నమోదైన నేరాలపై హైదరాబాద్ సీపీ ఆనంద్, రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక విషయాలను వెల్లడించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లో నిర్వహించిన సమావేశంలో 2024 యాన్యువల్ రిపోర్ట్ ను హైదరాబాద్ సీపీ ఆనంద్ విడుదల చేయగా, రాచకొండ కమిషనరేట్ కి సంబంధించిన క్రైమ్ వివరాలను సీపీ సుధీర్ కుమార్ వెల్లడించారు.

Cyber Crimes (Photo Credit : Google)
భారీగా పెరిగిన సైబర్, ఆర్థిక నేరాలు..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రాపర్టీ నేరాలు కొంతవరకు తగ్గాయన్నారు. కాగా.. సైబర్ , ఆర్థిక నేరాలు భారీగా పెరిగిపోతున్నాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 40 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. హత్యలు, హత్యాయత్నాలు, హత్యాచారాలు తగ్గాయన్నారు. 2025లో సైబర్, డ్రగ్స్ నేరాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ట్రాఫిక్ మేనేజ్ మెంట్, లా అండ్ ఆర్డర్ కోసం డ్రోన్స్ మెయింటెనెన్స్ వింగ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Also Read : నల్గొండ సీఐ అరాచకానికి పచ్చని కాపురం చిన్నాభిన్నం..!
గతేడాది ఓవరల్ గా 25వేల 488 ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా ఈ ఏడాది 35వేల 944 రిపోర్ట్ అయ్యాయని సీపీ తెలిపారు. ప్రతి ఫిర్యాదును ఎఫ్ఐఆర్ చేస్తున్నందున వలన 40 శాతం అధికంగా రిజిస్ట్రర్ అయ్యాయన్నారు. డయల్ 100కు వచ్చే కాల్స్ ద్వారా క్రైమ్ జరిగినప్పుడు ఏడు నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే స్పాట్ కు చేరుకుంటున్నామన్నారు.

Cyber Crimes
301 కోట్లు కొట్టేసిన సైబర్ క్రిమినల్స్..
ఈ ఏడాది సైబర్ నేరాలు భారీగా నమోదైనట్లు సీపీ ఆనంద్ వెల్లడించారు. మొత్తం 36 రకాల నేరాలతో సైబర్ చీటర్స్ రెచ్చిపోతున్నారని సీపీ తెలిపారు. ఈ ఏడాది డిజిటల్ అరెస్ట్ కేసులో ఎక్కువ శాతం రిపోర్ట్ అయ్యాయన్నారు. సిటీ సైబర్ క్రైమ్ పీఎస్ లో 4వేల 42 కేసులు నమోదవగా.. 301 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారని అన్నారు. ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్నారు. బాధితులు కోల్పోయిన రూ.42 కోట్లు రికవరీ చేశామన్నారు. సైబర్ క్రైమ్ కేసుల్లో 30శాతం కేసులను డిటెక్షన్ చేసి 500 మందికిపైగా సైబర్ క్రిమినల్స్ ను అరెస్ట్ చేశామన్నారు.
Also Read : ఏపీలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు..