భుజాన సంచులు, అందులో మారణాయుధాలు..! విజయనగరంలో లేడీ గ్యాంగ్ కలకలం..
ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించారు.

Vizianagaram Lady Gang : విజయనగరంలో అంతర్రాష్ట్ర లేడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఆరుగురు మహిళలు నగర ప్రధాన కూడళ్లలో అర్థరాత్రి పూట విచ్చల విడిగా తిరుగుతూ దోపిడీలకు పాల్పడుతున్నారు. భుజాలకు సంచులు తగిలించుకుని చెత్త ఏరుకునే మహిళల్లా నటిస్తూ షాపుల తాళాలు పగలకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు కిలేడీలు. చోరీ చేసేందుకు కావాల్సిన ఇనుప రాడ్లు వంటి మారణాయుధాలను సంచుల్లో తీసుకెళ్తున్నారు. తాజాగా ఈ లేడీ గ్యాంగ్ ఓ షాపు తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించగా.. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
విజయనగరం పట్టణంలో రెండు రోజులుగా ఈ లేడీ గ్యాంగ్ వ్యవహారంపై కలకలం రేగింది. అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన లేడీ గ్యాంగ్.. అర్థరాత్రి 2 గంటల తర్వాత వీధుల్లోకి వస్తారు. షాపులే వారి టార్గెట్. షాపులకు వేసిన తాళాలు పగలగొట్టి చోరీకి ప్రయత్నిస్తారు. ఓ షాపు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేయగా.. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఫుటేజీ చూసిన షాపు యజమాని తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఈ లేడీ గ్యాంగ్ గురించి తెలిసి స్థానికులు సైతం ఉలిక్కిపడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ మహిళలను పట్టుకోవాలని, తమ షాపులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : మరోసారి ఢిల్లీలో డ్రగ్స్ కలకలం.. ఏకంగా రూ.2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం.. స్నాక్స్ మాటున సప్లయ్..
ఆ మహిళలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకిలా చేస్తున్నారు?
అసలు ఈ మహిళలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకిలా చేస్తున్నారు? అనేది అంతు చిక్కడం లేదంటున్నారు స్థానికులు. సీసీ ఫుటేజీ బయటకు వచ్చాక షాపుల యజమానులు అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ లేడీ గ్యాంగ్ లో సుమారుగా ఆరుగురు మహిళలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారంతా తమ భుజాన సంచులు వేసుకున్నారు. చెత్త ఏరుకునే మహిళల్లా కనిపిస్తున్నారు. కానీ, వారి టార్గెట్ చోరీలు. ప్రధాన వీధుల్లో సంచరిస్తూ బంగారు షాపులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సంచుల్లో ఉండే మారణాయుధాలతో తాళాలు పగలగొట్టి లోపలకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
షాపులకు వేసిన తాళాలు తెరిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, అవి ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయం షాపులు తెరిచేందుకు వచ్చిన యజమానులు.. తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచేందుకు ఎవరో ప్రయత్నించినట్లు గుర్తించారు షాక్ అయ్యారు. వెంటనే సీసీటీవీ ఫుటేజీ చెక్ చేశారు. అందులో దృశ్యాలు చూసి మరింత భయాందోళనకు గురయ్యారు. అందులో ఇద్దరు మహిళలు కనిపించారు. వారి భుజాల్లో సంచులు ఉన్నాయి. ఆ ఇద్దరు మహిళలు రాడ్ తో షాపు తాళాలు ఓపెన్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించడం ఆ ఫుటేజీలో ఉంది.
తీవ్ర భయాందోళనలో షాపుల యజమానులు..
వెంటనే షాపు యజమానులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అసలు ఆ మహిళలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వాళ్లు ఏం చేస్తుంటారు? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. పగలంతా కూడా ఈ మహిళలు చెత్త ఏరుకునే వాళ్లలా నటిస్తూ తిరుగుతుంటారని, రాత్రి కాగానే దోపిడీలకు పాల్పడుతున్నారని ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది.
Also Read : విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..