ఆగని ఆత్మహత్యలు : గన్‌తో కాల్చుకున్న ఇంటర్ విద్యార్థి

హైదరాబాద్ : నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో సొహైల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి గన్ తో కాల్చుకుని చనిపోయాడు. సొహైల్ తండ్రి మహరుద్దీన్ రిటైర్డ్ ఆర్మీ అధికారి. ఆయన దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది. దాంతో కాల్చుకుని సొహైల్ చనిపోయాడు. సోమవారం (ఏప్రిల్ 29,2019) రాత్రి 1.30గంటలకు ఈ ఘటన జరిగింది. బెడ్ పై పడుకుని నుదుటిపై సొహైల్ కాల్చుకున్నాడు. స్పాట్ లోనే చనిపోయాడు.
సొహైల్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. సొహైల్ చాలా మంచి వాడు అని చుట్టుపక్కల వారు చెప్పారు. సొహైల్ ఆత్మహత్య చేసుకోవడం షాక్ కి గురి చేసిందన్నారు.