Jharkhand woman tonsured : ప్రియుడితో లేచిపోయిందని మహిళకు శిరోముండనం చేయించిన బంధువులు

Jharkhand woman tonsured : ప్రియుడితో లేచిపోయిందని మహిళకు శిరోముండనం చేయించిన బంధువులు

Jharkhand Woman Tonsured

Updated On : April 6, 2021 / 3:34 PM IST

Married woman tonsured, face blackened for eloping with lover : జార్ఖండ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడితో లేచిపోయిన వివాహిత మహిళను,ఆమె బంధువులు వెతికి తీసుకువచ్చి, శిరోముండనం చేసి ముఖానికి నల్లరంగు పూసి అవమానించారు.

పాలమూ జిల్లాలోని సెమ్రా పంచాయతీలో భర్త, అత్తమామలతో నివసిస్తున్న మహిళకు పనేరిబంద్ గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈక్రమంలో నెల రోజుల క్రితం వారిద్దరూ ఆగ్రామంనుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి పనేరిబంద్ గ్రామంలో కాపురం పెట్టారు.

ఏప్రిల్ 5 ఆదివారం నాడు ఆమెను గుర్తించిన బంధువులు తమ గ్రామానికి తీసుకు వచ్చారు. గ్రామంలో ఆమెకు గుండు గీయించి ముఖానికి నల్లరంగు పూసి అవమానించారు. అనంతరం ఆమెను ప్రియుడి దగ్గరకు పంపించారు.

ఈ దృశ్యాలను కొందరు మొబైల్ ఫోన్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఘటనపై పాలము జిల్లా ఎస్పీ సంజీవ్ కుమార్ స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత చైన్ పూర్ పోలీసులను ఆదేశించారు. ఈఘటనలో 12 మందిని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా 12 మందిలో బాధితురాలి భర్త కూడా ఉన్నట్లు చైన్ పూర్ ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.