ప్రియాంక హత్య కేసు : ఆ బైక్ చూస్తేనే క్రూరత్వం తెలుస్తోంది

ప్రియాంక రెడ్డి హత్యకేసులో నిందితుడు జొల్లు నవీన్ లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. అతడిది ఎంత క్రూర మనస్తత్వమో అతని బైక్‌ను చూస్తేనే అర్థమవుతుంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, ఎల్లప్ప దంపతులకుమారుడే నవీన్ వీరికి నవీన్ తోపాటు ఓ కుమార్తె కూడా ఉంది. తండ్రి చిన్నప్పుడే మరణించటంతో తల్లి లక్ష్మమ్మ కాయకష్టం చేస్తూ నవీన్‌తో పాటు కుమార్తెను పెంచి పెద్ద చేసింది.
పదో తరగతి తర్వాత నవీన్ చెడు తిరుగుళ్లకు అలవాటు పట్టాడు. ఊర్లోనే జల్సాలు చేస్తూ పలువురిని వేధించేవాడు.ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ పరిచయం అయిన తర్వాత నవీన్ మరింత చెడిపోయాడు. నవీన్‌కు ఒక బైక్ ఉంది. అతని బైక్‌ను స్పోర్ట్స్ బైక్‌లా మార్చేసి పెద్ద శబ్దం వచ్చేలా సైలెన్సర్ ఏర్పాటు చేసి గ్రామంలో హల్‌చల్ చేసేవాడు.
బైక్‌కు ఉన్న హెడ్‌లైట్ తీసేసి అక్కడ డేంజర్ సింబల్‌ను సూచించే పుర్రె గుర్తును ఏర్పాటు చేయించుకున్నాడు. నంబర్ ప్లేట్ స్థానంలో ఎరుపు రంగులో డేంజర్ అని రాయించాడు. ముందు టైరు మడ్గాడ్ పై వేటాడే క్రూర మృగం బొమ్మ వేయించాడు. నవీన్ బైక్‌ను చూస్తే అతనో క్రూర మృగంలా గ్రామంలో ప్రవర్తించేవాడని తెలుస్తోంది. గ్రామస్తులు కూడా నవీన్ ప్రవర్తన పట్ల విసిగిపోయి.. హెచ్చరించినా కూడా అతను ప్రవర్తన మార్చుకోలేదని తెలుస్తోంది.