కారు బీభత్సం : మెట్రో పిల్లర్ ను గుద్దేశారు

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. మద్యం మత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నారు. జనవరి 27వ తేదీ ఆదివారం రాత్రి అపోలో ఆసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించిన ఘటన మరిచిపోక ముందే మరో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 36లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువకులు అత్యంత వేగంగా కారు నడిపారు. దీనితో అక్కడున్న జనాలు ప్రాణభయంతో పరుగులు తీశారు. మెట్రో పిల్లర్‌ను కారు ఢీకొంది. కారులో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.