జూబ్లీహిల్స్ సీఐ, ఎస్ ఐ సస్పెన్షన్
హైదరాబాద్ లో అవినీతి ఖాకీలపై వేటు పడింది. అవినీతి ఆరోపణలపై జూబ్లీహిల్స్ సీఐ బలవంతయ్య సస్పెండ్ అయ్యారు.

హైదరాబాద్ లో అవినీతి ఖాకీలపై వేటు పడింది. అవినీతి ఆరోపణలపై జూబ్లీహిల్స్ సీఐ బలవంతయ్య సస్పెండ్ అయ్యారు.
హైదరాబాద్ లో అవినీతి ఖాకీలపై వేటు పడింది. అవినీతి ఆరోపణలపై జూబ్లీహిల్స్ సీఐ బలవంతయ్య సస్పెండ్ అయ్యారు. ఆయనను విధుల నుంచి తప్పిస్తూ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వూలు జారీ చేశారు. నిన్నటి నుంచి పరారీలో ఉన్న బలవంతయ్య కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. అతడు ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో బంధువుల ద్వారా అతని ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎస్ ఐ సుధీర్ రెడ్డి పోలీస్ స్టేషన్ లోనే లంచం తీసుకుంటూ పట్టుబడటం కలకలం రేపింది.
స్టేషన్ బెయిల్ కోసం వంశీ కృష్ణ అనే వ్యక్తి నుంచి రూ.50 వేలు తీసుకుంటూ సుధీర్ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. అయితే సీఐ బలవంతయ్య చెబితేనే ఆ డబ్బులు తీసుకున్నానని సుధీర్ రెడ్డి చెప్పారు. దీంతో సీఐ బలవంతయ్యపై కూడా కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బలవంతయ్య పరారయ్యాడు. సీఐ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎస్ ఐ, సీఐలను హైదరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. పోలీసు శాఖలో ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నగరంలో లంచం డిమాండ్ చేస్తే 9490616555 నెంబర్ కు ఫోన్ చేసి..తనకు నేరుగా ఫిర్యాదు చేయాలని సీపీ అంజనీకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
2019, డిసెంబర్ 29న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసు నమోదు అయింది. ఆ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వంశీ కృష్ణ వద్ద నుంచి మొత్తం రూ.50 వేలు, రెండు స్కాచ్ బాటిల్స్ ను కూడా ఎస్ ఐ సుధీర్ రెడ్డి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సివిల్ తగాదాలో ఎస్ ఐ సుధీర్ రెడ్డి ప్రమేయం ఉంది. అలాగే సీఐ బలవంతయ్య ఆదేశాల మేరకే ఆ డబ్బులు డిమాండ్ చేసి, డబ్బులు తీసున్నట్లు ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో సీఐ బలవంతయ్యలపై వేటు పడింది. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ ఐ సుధీర్ రెడ్డిపై కూడా వేటు పడింది. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మెదక్ జిల్లా గజ్వేల్ ప్రాంతానికి చెందిన సుధీర్ 2014 బ్యాచ్‌కు చెందిన వాడు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో 18 నెలల నుంచి పని చేస్తున్నారు. అడ్మిన్ ఎస్ఐ..విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా సివిల్ తగాదాల్లో లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందడంతో దాడి చేశారు. ఈ ఘటనలో సీఐ బలవంతయ్య పాత్ర కూడా ఉందని సుధీర్ రెడ్డి చెప్పారు. మూడు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.