పెళ్లికి సరిగ్గా రెండు రోజుల ముందు, వధువు దారుణ హత్య

  • Published By: naveen ,Published On : July 4, 2020 / 04:11 PM IST
పెళ్లికి సరిగ్గా రెండు రోజుల ముందు, వధువు దారుణ హత్య

Updated On : July 4, 2020 / 5:00 PM IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పెళ్లింట విషాదం అలుముకుంది. పెళ్లికి సరిగ్గా రెండు రోజుల ముందు వధువు, ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా జూలై 3న వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఆ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతా ఆనందంగా ఉన్నారు. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. గన్ తో ఆ ఇంట్లోకి చొరబడ్డ దుండగడు 19 ఏళ్ల దళిత పెళ్లి కూతురు, ఆమె తండ్రిపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో వారిద్దరూ స్పాట్ లోనే చనిపోయారు. ఈ కాల్పుల్లో వధువు సోదరుడు కూడా గాయపడ్డాడు.

Reduced crime in states due to nationwide lockdown

గన్ తో వచ్చి కాల్పులు:
కాల్పులు జరిపింది మృతురాలికి తెలిసిన వాడే అని పోలీసుల విచారణలో తేలింది. తనను పెళ్లి చేసుకోవాలని అతడు అమ్మాయిని కోరాడు. అందుకు ఆమె తిరస్కరించింది. దీంతో అమ్మాయిపై కక్ష పెంచుకున్న అతడు ఇలా కాల్చి చంపాడని మృతురాలి సోదరుడు పోలీసులతో చెప్పాడు. ”జూన్ 27న తన స్నేహితులతో కలిసి మా ఇంటికి వచ్చాడు. అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయాలని మాపై ఒత్తిడి తెచ్చాడు. మేము కాదనేసరికి గన్ తో కాల్పులు జరిపాడు” అని మృతురాలి సోదరుడు తెలిపాడు.

పరారీలో నిందితుడు:
కాల్పులు జరిపాక నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు సహా 5మందిపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read:షాకింగ్ వీడియో : మహిళను CAR తో ఢీ కొట్టి..వెళ్లిపోయిన SI