Bengaluru : చీటింగ్ కేసులో నటుడు నిర్మాత అరెస్ట్

చీటింగ్ కేసులో శాండల్ ఉడ్ నటుడు,నిర్మాత వీరేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.

Bengaluru : చీటింగ్ కేసులో నటుడు నిర్మాత అరెస్ట్

Veerandra Babu

Updated On : July 17, 2022 / 3:00 PM IST

Bengaluru :  చీటింగ్ కేసులో శాండల్ ఉడ్ నటుడు,నిర్మాత వీరేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరు కోడిగేహళ్లి పోలీసు స్టేషన్ లో ధార్వాడ్ కు చెందిన బసవరాజ గోపాల్(53) అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

రాష్ట్ర జనహిత అనే పార్టీని స్ధాపించిన వీరేంద్ర బాబు… ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని చెప్పి రూ. 1.88 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కోన్నాడు. ఈ కేసులో వీరేంద్రబాబుతో సహా అతని స్నేహితులు ఏడుగురిపై కూడా గోపాల్ ఫిర్యాదు చేశారు.

2011లో విడుదలైన స్వయంకృషి సినిమాతో వీరేంద్రబాబు బాగా పాపులర్ అయ్యారు. స్వయంకృషి అనే చిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించిన వీరేంద్రబాబు తమ వెంచర్లలో పెట్టుబడి పెట్టమని కూడా గోపాల్ అతని మిత్రులను కోరినట్లు భాదితుడు తెలిపారు.

Also Read : Monkeypox: ఏపీలో మంకీపాక్స్ కలకలం!