Monkeypox: ఏపీలో మంకీపాక్స్ కలకలం!

విజయవాడలో ఓ చిన్నారికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీపాక్స్ కేసుగా వైద్యులు భావిస్తున్నారు.

Monkeypox: ఏపీలో మంకీపాక్స్ కలకలం!

Monkeypox

Monkeypox: ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వైరస్ కలవరానికి గురిచేస్తోంది. భారీగా మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం ఇండియాలోనూ తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఏపీలోను మంకీపాక్స్ కలకలం రేగింది. ఓ చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు వైద్య అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Monkeypox: మంకీపాక్స్ నివారణకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

విజయవాడలో ఓ చిన్నారికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీపాక్స్ కేసుగా వైద్యులు భావిస్తున్నారు. అయితే విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. చిన్నారి నమూనాలను సేకరించి పూణె ల్యాబ్ కు పంపించారు. చిన్నారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్ లో ఉంచారు. అయితే ఈ సమాచారాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.