TV Actress Soujanya : యువనటి సౌజన్య ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
టీవీ సీరియల్స్ నటి సౌజన్య (25) ఆత్మ హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.

Soujanya Vivek
TV Actress Soujanya : టీవీ సీరియల్స్ నటి సౌజన్య (25) ఆత్మ హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నటుకు వివేక్ ప్రేమ, పెళ్లి పేరుతో తమ కూతురుని వేధించటం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందిని ఆమెతండ్రి ప్రభు మాదప్ప ఆరోపించారు. నటుడు వివేక్, అసిస్టెంట్ మహేశ్ లపై కుంబళగోడు పోలీసు స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు.తమ కూతురు అమాయకురాలని, ఎలాంటి తప్పుచేయలేదని తెలిపారు.
కర్ణాటకలోని కొడుగు జిల్లా కుశల్ నగర్ కు చెందిన సౌజన్య కొన్ని కన్నడ సీరియల్స్ లోనూ, సినిమాల్లోనూ నటించింది. సెప్టెంబర్ 30న బెంగుళూరులోని ఆమె గ దిలో ఆత్మహత్య చేసుకుంది. గదిలో 3 పేజీల సూసైడ్ నోటో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన కూతురు దగ్గర ఉండే బంగారం,డబ్బులు కనిపించడంలేదని ప్రభు మాదప్ప తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read : Gold Cheating : ఇత్తడిని పుత్తడిగా నమ్మించి కోట్లు దోచుకున్నాడు
కాగా, నిందితుడు వివేక్ కు ఒక సంవత్సరం నుంచి తన కూతురితో పరిచయం ఉందని తెలిపారు. తన కూతురిని ప్రేమించాలని వేధించే వాడని మాదప్ప చెప్పుకొచ్చారు. కాగా, పోలీసులు వచ్చేలోగా ఘటనా స్థలం నుంచి తన కూతురి మృత దేహన్ని నిందితుడు మార్చాడని ఆరోపించాడు. ఆమె మొబైల్ కూడా కనిపించడం లేదని మాదప్ప తెలిపారు. మొబైల్ దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.

Atress Soujanya
సౌజన్య తండ్రి మాదప్ప ఆరోపణలపై నటుడు వివేక్ స్పందిస్తూ.. ఇప్పుడు తానేమి చెప్పలేనని అన్నాడు. నటి సౌజన్య తనకు.. ఏడాదిగా తెలుసని అన్నాడు. ఆమె చాలా అమాయకురాలని అన్నాడు. సౌజన్య.. ఒత్తిడికి గురైనప్పుడల్లా తన బాధను నాతో చెప్పుకునేదని వివేక్ తెలిపాడు. తాను పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు వివేక్ తెలిపాడు.
ఇక ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సూచించారు. కాగా, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.
మరోవైపు సౌజన్య గదిలో లభించిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఆమె తన మానసిక స్థితి బాగాలేదని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసింది.

Soujnya Suicide Letter 1

Soujnya Suicide Letter 2

Soujnya Suicide Letter 3