Tamil Nadu : కిక్ సినిమా చూశాడా ఏందీ ? ఏటీఎం చోరీకి యత్నం..కానీ
దొంగలు రెచ్చిపోతున్నారు. వినూత్న పద్ధతులను ఎంచుకుంటున్నారు. చోరీలకు పాల్పడిన అనంతరం పోలీసులకు దొరక్కకుండా ఉండేందుకు ఎన్నో ప్లాన్స్ రచిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో వెరైటీగా దొంగతనం చేయాలని ప్రయత్నించాడు. ముఖం గుర్తించకుండా ఉండేందుకు జోకర్ బొమ్మ పెట్టుకుని ఏటీఎంలో ఉన్న డబ్బును దొంగలించడానికి ప్రయత్నించాడు.

Atm
Kanyakumari ATM Robbery Case : దొంగలు రెచ్చిపోతున్నారు. వినూత్న పద్ధతులను ఎంచుకుంటున్నారు. చోరీలకు పాల్పడిన అనంతరం పోలీసులకు దొరక్కకుండా ఉండేందుకు ఎన్నో ప్లాన్స్ రచిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో వెరైటీగా దొంగతనం చేయాలని ప్రయత్నించాడు. ముఖం గుర్తించకుండా ఉండేందుకు జోకర్ బొమ్మ పెట్టుకుని ఏటీఎంలో ఉన్న డబ్బును దొంగిలించడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Read More : Children’s tub : బిడ్డల్ని పారేసే తల్లులకు విజ్ఞప్తి..‘పిల్లల తొట్టి’లో వదలండి
తమిళనాడు కన్యాకుమారిలో దొంగలు రెచ్చిపోతున్నారు. కురంబనలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎం సెంటర్‌ను టార్గెట్ చేశాడో ఓ దొంగ. రాత్రి వేళ ఏటీఎం సెంటర్ లో చొరబడ్డాడు. పోలీసులకు చిక్కకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నాడా దొంగ. ఫేస్‌కు జోకర్ మాస్క్ వేసుకుని ఏటీఎంలోకి ఎంట్రీ ఇచ్చిన దొంగ…మెషిన్‌ను పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లేందుకు ట్రై చేశాడు. ఓ సాధనంతో మెషిన్ ను పగులగొట్టేందుకు ట్రై చేశాడు. కానీ ప్రయత్నం విఫలమైంది. ఎంత చేసినా… వర్కవుట్ కాకపోవడంతో.. ఖాళీ చేతుల్తో వెళ్లాల్సి వచ్చింది. విషయం గమనించిన స్థానికులు తెల్లవారుజామున పోలీసులకు సమాచారమిచ్చారు.