మద్యం తాగించి…సిగరెట్లతో కాల్చి మహిళపై సామూహిక అత్యాచారం

  • Published By: murthy ,Published On : June 7, 2020 / 07:05 AM IST
మద్యం తాగించి…సిగరెట్లతో కాల్చి మహిళపై సామూహిక అత్యాచారం

Updated On : June 7, 2020 / 7:05 AM IST

తాళి కట్టిన భార్యను నలుగురు స్నేహితులతో కలిసి షేర్ చేసుకుని, కన్నకొడుకు ఎదుట సామూహిక అత్యాచారం చేశాడో ప్రబుధ్దుడు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈఘటన కేరళలో జరిగింది. 

తిరువనంతపురానికి చెందిన 25 ఏళ్ల మహిళ, ఐదేళ్ల కుమారుడిని ఆమె భర్త గురువారం సాయంత్రం బీచ్ కు తీసుకువెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి వారిని తన స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ తన కుమారుడి ముందే భార్య చేత మద్యం తాగించాడు. ఆతర్వాత నలుగురు స్నేహితులు ఆమెపై  సామూహికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. వీరిలో కొందరు ఆమె శరీరాన్నిసిగరెట్లుతో కాల్చారు. 

అనంతరం…. రోడ్డు పక్కన  మద్యం మత్తులో  గాయాలతో పడి ఉన్న ఆమెను ఒక యువకుడు రక్షించి ..తన ఇంటికి తీసుకువెళ్లి  పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కడినంకుళం పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి వద్దనుంచి వాంగ్మూలం నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.