మిస్టరీ ఉందా : మలయాళ దర్శకురాలు నయన్ మృతి

యువ మళయాల దర్శకురాలు నయన్ సూర్యన్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తిరువనంతపురంలోని ఆమె నివాసంలోని బెడ్ రూమ్ లో సోమవారం(ఫిబ్రవరి-25,2019) ఉదయం శవమై కనిపించింది. నయన్ స్వస్థలం అలప్పాడ్. కూతురు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులు నయన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. నయన ఇంటికి వెళ్లిన స్నేహితులకి.. ఆమె బెడ్ రూమ్ లో శవంగా కనిపింది. పోస్ట్ మార్టం తర్వాతే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు వెల్లడించారు. కొన్నాళ్లుగా ఆమె డయాబెటిస్ కు ట్రీట్మెంట్ తీసుకుంటుందని తెలిపారు.
Read Also: అక్కడ ఏం జరిగింది : శ్రీధరణిని చంపింది ప్రియుడేనా!
ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నయన్ మృతిపై మాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సహాయదర్శకురాలిగా కూడా పలువురు అగ్ర దర్శకుల దగ్గర ఆమె పని చేసింది. వివిధ ప్రకటనలకు నయన్ డైరెక్ట్ చేసింది. దేశంలో, విదేశాల్లో స్టేజ్ షోలు ఇచ్చింది. నయన్ లెనిన్ రాజేంద్రన్ అనే అగ్ర దర్శకుడి దగ్గర సహాయ దర్శకురాలిగా పనిచేసిందని, 2019 జనవరి 14 ఆయన అనారోగ్యంతో చనిపోయారు. గురువులాంటి లెనిన్ లేడనే బాధ కూడా ఆమెను వెంటాడినట్లు చెబుతున్నారు.
యువ దర్శకురాలు నయన్ మృతి సహజమా – లేక ప్రేరేపిత ఆత్మహత్యా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి అనుమానాస్పద కేసు కింద విచారణ చేపట్టామని.. అన్ని కోణాలు ఎంక్వయిరీ నడుస్తుందని ప్రకటించారు తిరువనంతపురం పోలీసులు.
Read Also: కొత్త చట్టం ఎఫెక్ట్ : మళ్లీ నోట్ల కష్టాలు రాబోతున్నాయా.. ATMలు ఖాళీనా!