విశాఖలో కలకలం, మనిషి పుర్రెను కాల్చుకుని తిన్న యువతీ యువకుడు

  • Published By: naveen ,Published On : August 16, 2020 / 01:14 PM IST
విశాఖలో కలకలం, మనిషి పుర్రెను కాల్చుకుని తిన్న యువతీ యువకుడు

Updated On : August 16, 2020 / 3:57 PM IST

విశాఖపట్నం రెల్లి వీధిలో మనిషి పుర్రె కలకలం రేగింది. రెల్లి వీధిలో ఓ యువకుడు మనిషి పుర్రెను కాల్చుకుని తింటున్నాడు. ఇది గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం(ఆగస్టు 16,2020) ఉదయం రెల్లి వీధిలో ఓ పాడుబడ్డ ఇంట్లో యువకుడు పుర్రెను కాల్చుకుని తింటున్నాడు. ఇది స్థానికుల కంట పడింది. దీంతో వారంతా షాక్ కి గురయ్యారు. భయాందోళనకు గురై కేకలు వేయగా జనం గుమిగూడారు. ఆ పుర్రెని ఎక్కడి నుంచి తెచ్చావని ఆ యువకుడిని ప్రశ్నించారు. దీంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.



ఆ యువకుడి పేరు రావెలపూడి రాజు. వయసు 20ఏళ్లు. పాడుబడిన ఇంట్లో ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న రాజు కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసగా మారి సైకోలా వ్యవహరిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాఫ్తు చేపట్టారు.



కాగా, రాజుతో పాటు అదే ఇంట్లో ఉన్న యువతి కూడా మనిషి పుర్రెను కాల్చుకుని తింటున్నట్టు తెలిసి స్థానికులు మరింత భయపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు యువతిని, యువకుడిని వెతికి పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. యానాపురం సమీపంలో శవాలను కాల్చే ప్రాంతం ఉంది. అక్కడి నుంచే ఈ పుర్రెని తీసుకుని వచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మతిస్థిమితం కోల్పోయిన కారణంగా రాజు అక్కడి నుంచి పుర్రెని తీసుకొచ్చి తినే ప్రయత్నం చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. రాజుతో పాటు ఉంటున్న యువతి వయసు 18ఏళ్లు. ఆ యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు యువతీ, యువకులను ప్రశ్నిస్తున్నారు.