ఛీ..ఛీ…. వీడికిదేం పోయేకాలం

ఛీ..ఛీ…. వీడికిదేం పోయేకాలం

Updated On : January 27, 2021 / 3:57 PM IST

Man arrested for tearing girl’s inner wear in Coimbatore : ఇరుగు పొరుగు వారి బాత్ రూంల్లో ప్రవేశించి అక్కడ ఉన్న మహిళల లోదుస్తులవను పాడు చేస్తున్న వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కొట్టుచెర్రి గ్రామానికి చెందిన సుందర్రాజు(38) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. నెలరోజుల క్రితం పనికోసం కోయంబత్తూరువచ్చి ఒక్కిలిపాళియంలో అద్దె ఇంట్లో తోటి పనివారితో కలిసి జీవిస్తున్నాడు.

అయితే గత ఐదురోజులుగా చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని బాత్ రూంల్లోకి దొంగతనంగా ప్రవేశించి మహిళల లోదుస్తులను పాడు చేయటం మొదలెట్టాడు.ఇది గమనించిన కొంతమంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354(ఏ) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుందర్రాజును అరెస్ట్ చేశారు.