Man fed up of Unwell wife : అనారోగ్యంతో ఉన్న భార్యకు వైద్యం చేయించలేక హత్య చేసిన భర్త

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న భార్యకు వైద్యం చేయించే స్ధోమత లేక భర్త ఆమెను హత్యచేసిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది.

Man fed up of Unwell wife : అనారోగ్యంతో ఉన్న భార్యకు వైద్యం చేయించలేక హత్య చేసిన భర్త

Husband Kills Wife

Updated On : March 15, 2021 / 6:01 PM IST

Man fed up of Unwell wife,Kills her,arrested, police : బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న భార్యకు వైద్యం చేయించే స్ధోమత లేక భర్త ఆమెను హత్యచేసిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది.

మహారాష్ట్రలోని పర్బని జిల్లాలోని ముద్గల్ గ్రామంలో 45 ఏళ్ల నిరుద్యోగి భార్యకు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వచ్చింది. గతంలో భర్త ఉద్యోగం చేస్తున్నంత కాలం ఆమెకు వైద్య ఖర్చులను భరించాడు.

కానీ ఇటీవలి కాలంలో అతనికి ఉన్న ఉద్యోగం కూడా పోవటంతో నిరుద్యోగిగా మారాడు. దీంతో ఆర్ధిక బాధలు ఎక్కువైపోయాయి. చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ భార్య మందులు కొనటానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు.

ఇల్లు గడవటమే కష్టంగా ఉంటే ఇంక మందులకు డబ్బులు సమకూర్చలేక శనివారం మార్చి13వ తేదీ రాత్రి భార్యను కత్తితో పొడిచి చంపాడు.అనంతరం బయటకు వచ్చి రక్తపు మరకలు ఉన్న బట్టలను, కత్తితో ఇంటిసమీపంలోని పొదల్లో పడేసి వెళ్లిపోయాడు.

ఇది చూసిన ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేశారు.

కాగా భార్య అనారోగ్యం..వైద్య ఖర్చులతో విసుగు చెంది ఆమెను హత్య చేసినట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిపై పాథారి పోలీసు స్టేషన్ లో హత్యానేరంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.