Milk Adulteration : ఈ పాలు తాగితే పైకి పోవాల్సిందే..! యాదాద్రి జిల్లాలో కల్తీ పాల దందా

Milk Adulteration : ఈ కల్తీ పాలను హోటల్స్ కు సరఫరా చేస్తున్నట్లుగా పోలీసుల తనిఖీల్లో తేలింది. కల్తీ పాలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

Milk Adulteration : ఈ పాలు తాగితే పైకి పోవాల్సిందే..! యాదాద్రి జిల్లాలో కల్తీ పాల దందా

Milk adulteration

Updated On : May 3, 2023 / 8:27 PM IST

Milk Adulteration : యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాల దందా జోరుగా సాగుతోంది. ఎస్ఓటీ పోలీసులు చేస్తున్న దాడుల్లో కల్తీ పాల తయారీ కేంద్రాలు వెలుగులోకి వస్తున్నాయి. భూదాన్ పోచంపల్లి మండలం జూలూరులో కల్తీ పాలు తయారీ చేస్తూ కాసులు దండుకుంటున్నారు కేటుగాళ్లు. పాలను కల్తీ చేసి విక్రయిస్తున్న శేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

శేఖర్ నుంచి 100 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీకి ఉపయోగించే 500 మిల్లీమీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ని సీజ్ చేశారు. ఈ కల్తీ పాలను హోటల్స్ కు సరఫరా చేస్తున్నట్లుగా పోలీసుల తనిఖీల్లో తేలింది. కల్తీ పాలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

Also Read..Ice Cream Adulteration : పిల్లలకు ఐస్‌క్రీమ్స్ కొనిస్తున్నారా? అయితే బీ కేర్‌ ఫుల్.. పోలీసుల దాడుల్లో షాకింగ్ నిజాలు

శేఖర్ పాలను కల్తీ చేస్తున్న తీరు చూసి పోలీసులే విస్తుపోయారు. అవి కల్తీ చేసిన పాలు అనే అనుమానమే కలగని రీతిలో అతడు పాలను కల్తీ చేసి విక్రయిస్తున్నాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం కలగకుండా, మూడో కంటికి తెలియదు.. గుట్టుచప్పుడు కాకుండా పాలను కల్తీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ పాలను హోటల్స్ కు సప్లయ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలియని హోటల్ నిర్వాహాకులు ఆ పాలను అలాగే వినియోగిస్తున్నారు. ఆ పాలనే హోటల్ కి వచ్చే కస్టమర్లకు ఇస్తున్నారు. ఈ విషయాలేవీ తెలియని కస్టమర్లు.. ఆ పాలను తాగి జబ్బుల బారిన పడుతున్నారు.

ఇలాంటి పాలు ఆరోగ్యంపై పెను ప్రభావమే చూపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆ పాలు తాగిన వారు రోగాల బారిన పడటం ఖాయమని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చని తెలిపారు.

Also Read..Chocolates : ఈ చాక్లెట్లు తింటే చావే..! హైదరాబాద్‌లో దారుణం.. పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు

మార్కెట్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏది ముట్టుకున్నా కల్తీ అనే మాట తరుచుగా వినిపిస్తోంది. కేటుగాళ్లు, అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కాసుల కక్కుర్తితో దిగజారిపోతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. మార్కెట్ లో అన్నింటిని కల్తీ చేసేస్తున్నారు. వాటిని మార్కెట్ లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.