ఇంటర్వ్యూకి 24 ఏళ్ల అమ్మాయిని ఇంటికి పిలిచాడు, లోపలికి వెళ్లగానే ఎండ్వాంటేజ్ తీసుకున్నాడు

  • Published By: sreehari ,Published On : September 30, 2020 / 08:09 PM IST
ఇంటర్వ్యూకి 24 ఏళ్ల అమ్మాయిని ఇంటికి పిలిచాడు, లోపలికి వెళ్లగానే ఎండ్వాంటేజ్ తీసుకున్నాడు

Updated On : September 30, 2020 / 9:08 PM IST

Crime & Rape news : ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసేవాడు. లాక్ డౌన్ టైంలో ఉద్యోగం పోయింది. తనకే ఉద్యోగం లేదు మరొకరికి ఉద్యోగం ఇస్తానని నమ్మబలికాడు. అది నమ్మిన ఓ అమ్మాయి అతడి ట్రాప్‌లో పడింది. ఓ రోజు ఇంటర్వ్యూకి రమ్మని పిలిచాడు. అదే అవకాశం చేసుకుని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఇంటర్వ్యూ చేయడానికి ఆఫీసుకు కాదు, ఇంటికి పిలిచాడు. ఒంటరిగా ఇంటర్వ్యూకు వచ్చిన అమ్మాయిని రూంలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. అక్కడనుంచి తప్పించుకున్న అమ్మాయి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు, అతన్ని పట్టుకున్నారు. రేపిస్ట్‌ను గుర్తుపట్టిందని పోలీసులు చెప్పారు.