రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

బాధితుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే శంషాబాద్ డీసీపీ రాజేశ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

Blast (Photo Credit : Google)

Massive Blast : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు చనిపోయారు. 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కంప్రెషర్ పేలడంతో ఈ ఘోరం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మృతి చెందిన కార్మికులు అస్సాం, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. బాధితుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే శంషాబాద్ డీసీపీ రాజేశ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద జరిగిన సమయంలో కంపెనీలో 150 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో గాయపడ్డ కార్మికులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతుల వివరాలు..
చిత్తరంజన్ (25)
రాం ప్రకాశ్ (45)
రోషన్ కుమార్ (21)
రాత్ కాంత్ (25)

సివియర్ యాక్షన్ ఉంటుంది- రాజేశ్, శంషాబాద్ డీసీపీ
కంప్రెషర్ బ్లాస్ట్ లో ఐదుగురు చనిపోయారు. 10 మందికి గాయాలయ్యాయి. వేరు వేరు ఆసుపత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిలో ఉ్తతరప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారున్నారు. రెవిన్యూ అధికారులు కంప్లైంట్ తీసుకుని విచారణ చేస్తాము. ఆపరేషన్స్, షిఫ్ట్ మేనేజర్లను అదుపులోకి తీసుకుంటాము. ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఫైర్ డిపార్ట్ మెంట్ రిపోర్ట్ కూడా తీసుకుంటాము. ఘటనపై సివియర్ యాక్షన్ ఉంటుంది.

శశాంక, రంగారెడ్డి జిల్లా కలెక్టర్
గ్లాస్ ఫ్యాక్టరీ లోని నామినేషన్ చేసే మిషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ సేఫ్టీ వాల్ పని చేయకపోవడంతో కంప్రెషర్ గేట్ ఒత్తిడికి గురై పేలింది. ప్రాధమిక సమాచారం మేరకు ఐదుగురు చనిపోయారు. 9మందికి గాయాలయ్యాయి. వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద విషయం తెలియగానే అన్ని శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి అదేశాల మేరకు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాము. లైటింగ్ లేకపోవడంతో ప్రమాద తీవ్రతను అంచనా వేయలేక పోతున్నాము.

షాద్ నగర్ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

Also Read : భీమిలిలో ఊహించని విషాదం.. కొడుకు మృతి, తట్టుకోలేక తండ్రి కూడా..