Fire Broke Out : సోనియా గాంధీ క్యాంప్ లో భారీ అగ్నిప్రమాదం

సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డివిజనల్ ఆఫీసర్ సత్పాల్ భరద్వాజ్ తెలిపారు.

Fire Broke Out : సోనియా గాంధీ క్యాంప్ లో భారీ అగ్నిప్రమాదం

Fire Broke Out (1) (1)

Updated On : April 7, 2023 / 11:01 AM IST

Fire Broke Out : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమల్కా కపషేరా ప్రాంతంలోని సోనియా గాంధీ క్యాంప్ లో ఉన్న కలప గోదాంలో శుక్రవారం(ఏప్రిల్7)న తెల్లవారుజామున అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. గోదాం అంతటా మంటలు వ్యాపించాయి. గోదాంలో కలప పెద్ద సంఖ్యలో ఉండటంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి.

సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది 16 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డివిజనల్ ఆఫీసర్ సత్పాల్ భరద్వాజ్ తెలిపారు.

Bangladesh: బంగ్లా బట్టల బజార్‭లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 3,000 దుకాణాలు

మంటలను త్వరగా అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.