Tragedy: ఘోర ప్రమాదం.. లోయలో పడిన వాహనం, 8మంది దుర్మరణం..

వాహనంలో మొత్తం 13 మంది ఉన్నారు. మువానీ గ్రామం నుండి బోక్తా గ్రామం వైపు వెళ్తున్నారు. ఇంతలో ఊహించని ఘోరం జరిగిపోయింది. మృతుల్లో

Tragedy: ఘోర ప్రమాదం.. లోయలో పడిన వాహనం, 8మంది దుర్మరణం..

Updated On : July 15, 2025 / 11:29 PM IST

Tragedy: ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8మంది చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు. మూవాని టౌన్ లోని సుని బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన జరిగింది. వాహనం అకస్మాత్తుగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదానికి గురైన బొలెరోలో 13 మంది ప్రయాణిస్తున్నారు. 150 మీటర్ల లోతు లోయలో వాహనం పడిపోయింది. స్పాట్ లోనే 8మంది చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు.

వాహనంలో మొత్తం 13 మంది ఉన్నారు. మువానీ గ్రామం నుండి బోక్తా గ్రామం వైపు వెళ్తున్నారు. ఇంతలో ఊహించని ఘోరం జరిగిపోయింది. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు. పోలీసులు స్థానికుల సాయంతో గాయపడ్డ వారిని లోయలోంచి బయటకు తీశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, రక్షణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లోయలోకి పడిన వాహనం పూర్తిగా దెబ్బతింది. మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేలు ప్రకటించారు. “ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మరణించిన ప్రతి ఒక్కరి బంధువులకు PMNRF నుండి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వబడుతుంది” అని ఎక్స్ లో తెలిపారు.

డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దాంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. లోయ నుంచి అన్ని మృతదేహాలను బయటకు తీశామని, మృతులంతా స్థానికులేనని అధికారులు తెలిపారు.