ఎంబీబీఎస్ విద్యార్థి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి శవాన్ని బావిలో పడేసిన దుండగులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేగొండ మండలం కనపర్తిలో ఎంబీబీఎస్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దుండగులు అతడి కాళ్లు, చేతులు కట్టేసి శవాన్ని బావిలో పడేశారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేగొండ మండలం కనపర్తిలో ఎంబీబీఎస్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దుండగులు అతడి కాళ్లు, చేతులు కట్టేసి శవాన్ని బావిలో పడేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేగొండ మండలం కనపర్తిలో ఎంబీబీఎస్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దుండగులు అతడి కాళ్లు, చేతులు కట్టేసి శవాన్ని బావిలో పడేశారు. ఈ ఘటన శనివారం (జనవరి 18, 2020) వెలుగులోకి వచ్చింది. మృతుడు తుమ్మనపల్లికి చెందిన తాళ్లపల్లి వంశీగా గుర్తించారు. వంశీ ఖమ్మంలోని ఓ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా తుమ్మలపల్లికి చెందిన తాళ్లపల్లి వంశీ (24).. ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకువెళ్లాడు. అయితే ఎంతసేపటికీ తిరిగి రాలేదు. వంశీ ఫోన్ కూడా పని చేయకపోవడంతో అతని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఈనేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనపర్తిలోని వ్యవసాయ బావిలో శవం కనిపించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి తాళ్ల సాయంతో బావిలోని శవాన్ని బయటకు తీసి వంశీగా గుర్తించారు. అయితే వంశీ బ్యాగ్‌లో ఓ యువతికి సంబంధించిన డైరీ లభ్యమైనట్లు తెలుస్తోంది. దీంతో వంశీ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల గొడవ కారణమా లేక ప్రేమ వ్యవహారమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.