Medico Preethi Case : సైఫ్‌తో పాటు అతడు కూడా.. మెడికో ప్రీతి కేసులో కీలక మలుపు, అనస్తీషియా HOD చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డాక్టర్ ప్రీతి కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ప్రీతి కేసు విచారణ కీలక మలుపు తీసుకుంటోంది. విచారణ నివేదికలతో అనస్థీషియా డిపార్ట్ మెంట్ హెచ్ ఓడీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కౌన్సిలింగ్ లో హెచ్ఓడీ నాగార్జున రెడ్డి వ్యవహరించిన తీరుపై ప్రీతి మరింత మనస్తాపం చెందినట్లు అనుమానాలు వస్తున్నాయి. కౌన్సిలింగ్ లో డాక్టర్ ప్రీతి కన్నీరు పెట్టడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. (Medico Preethi Case)

Medico Preethi Case : సైఫ్‌తో పాటు అతడు కూడా.. మెడికో ప్రీతి కేసులో కీలక మలుపు, అనస్తీషియా HOD చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Updated On : March 5, 2023 / 6:46 PM IST

Medico Preethi Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డాక్టర్ ప్రీతి కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ప్రీతి కేసు విచారణ కీలక మలుపు తీసుకుంటోంది. విచారణ నివేదికలతో అనస్థీషియా డిపార్ట్ మెంట్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కౌన్సిలింగ్ లో హెచ్ఓడీ నాగార్జున రెడ్డి వ్యవహరించిన తీరుపై ప్రీతి మరింత మనస్తాపం చెందినట్లు అనుమానాలు వస్తున్నాయి. కౌన్సిలింగ్ లో డాక్టర్ ప్రీతి కన్నీరు పెట్టడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఈ కేసులో సీనియర్ స్టూడెంట్ డాక్టర్ సైఫ్, అనస్థీషియా హెచ్ఓడీ డాక్టర్ నాగార్జున రెడ్డి వ్యవహారాన్ని ర్యాగింగ్ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక డాక్టర్ ప్రీతి ఆడియోలో హెచ్ఓడీ పేరు ప్రస్తావించడాన్ని పోలీసు శాఖ పరిగణలోకి తీసుకుంది. యూజీసీ నిబంధనల మేరకు ర్యాగింగ్ పరిధిలోకి డాక్టర్ ప్రీతి కేసు వస్తుందని పోలీసుల చెబుతున్నారు.(Medico Preethi Case)

Also Read..Medico Preeti Case : ప్రీతి డెత్ కేసులో కొత్త కోణాలు.. కీలకంగా మారిన డా.స్మృతి అభిప్రాయం

హన్మకొండ జీఎంహెచ్ అనస్తీషియా డిపార్ట్ మెంట్ లో డాక్టర్ ప్రీతి వేధింపులకు గురైనట్లు పోలీసులకు నిర్ధారణ వచ్చినట్లు సమాచారం. మరోవైపు లీవ్, కౌన్సిలింగ్ విషయంలో హెచ్ఓడీ నాగార్జున రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది.

ప్రీతి కేసులో అనస్థీషియా డిపార్ట్ మెంట్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వ్యవహారం మొత్తం ఆ డిపార్ట్ మెంట్ చుట్టే తిరుగుతోంది. అనస్తీషియా హెచ్ఓడీ నాగార్జున రెడ్డి వ్యవహారశైలి, డిపార్ట్ మెంట్ లో జరిగిన పరిణామాలు, నాగార్జున రెడ్డి అసమర్ధత, వైఫల్యం.. నివేదికలు చూపెడుతున్నాయి. సైఫ్ వేధింపులతో ప్రీతి తీవ్ర మనస్తాపానికి గురైంది.(Medico Preethi Case)

Also Read..Medico Preethi Case : మెడికో ప్రీతి మృతి కేసు.. పోలీసుల విచారణలో సైఫ్ కీలక విషయాలు వెల్లడి

దాని తర్వాత కౌన్సిలింగ్ లో కూడా ఆమెకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. కౌన్సిలింగ్ నుంచి భోరున విలపిస్తూ ప్రీతి బయటకు వచ్చింది. కౌన్సిలింగ్ తర్వాత ఆమె మరింత మనస్తాపం చెందింది. పోలీసులు విచారణలో కావొచ్చు, డిపార్ట్ మెంటల్ విచారణలో కావొచ్చు ఈ విషయమే వెలుగుచూసింది. కౌన్సిలింగ్ తర్వాత చాలా భరోసాతో బయటకు రావాల్సిన ప్రీతి.. ఎందుకు ఏడుస్తూ బయటకు వచ్చింది? ఇక లీవ్ విషయం కావొచ్చు, రోజువారి డ్యూటీ చార్ట్ విషయంలోనూ ఎన్నిసార్లు హెచ్ఓడీకి చెప్పినా ప్రీతికి ఫలితం దక్కలేదు.

Also Read..Satvik Case Report : శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ సూసైడ్.. ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్టు అందజేసిన ఎంక్వైరీ కమిటీ

కౌన్సిలింగ్ తర్వాత ఆమె మరింత కుంగిపోయింది. ప్రిన్సిపాల్ తో నేరుగా ఎందుకు మాట్లాడావు? సీనియర్స్ ను ఓవర్ లుక్ చేస్తున్నావు అంటూ కౌన్సిలింగ్ లో హెచ్ఓడీ చేసిన వ్యాఖ్యలను ప్రీతిని మరింత కుంగదీశాయి. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో ఈ నిజాలు వెలుగుచూశాయి. హన్మకొండలో ఉన్న జీఎంహెచ్ లో కేసు షీట్ కి సంబంధించిన రిపోర్టు మీద సైఫ్ వేధింపులు ఒకవైపు, అనస్తీషియా డిపార్ట్ మెంట్ లో హెచ్ఓడీ నాగార్జున రెడ్డి వ్యవహరించిన తీరు.. ప్రీతిని మరింత బాధించాయి. హెచ్ఓడీ నాగార్జున రెడ్డి వ్యవహార శైలిని కూడా వేధింపుల కోణంలోనే పోలీసులు చూస్తున్నారు.

సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి.. హైదరాబాద్‌ నిమ్స్‌లో 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడింది. వెంటిలేటర్, ఎక్మో‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆదివారం (ఫిబ్రవరి 26) రాత్రి 9.16 గంటలకు ప్రీతి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.(Medico Preethi Case)

Also Read..Abdullapurmet Incident : నవీన్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు.. హత్య ఎలా చేయాలో యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హరిహర కృష్ణ

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న హానికారక ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా ఆత్మహత్యకు యత్నించింది. తొలుత ఆమెకు వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ఆమెను బతికించేందుకు ప్రత్యేక వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. అయినా, ఫలితం లేకపోయింది.

Also Read.. Medico Preethi Case : మెడికో ప్రీతి కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన సోదరుడు

తమ కూతురు ప్రాణాలతో తిరిగి వస్తుందని ఆశించిన తల్లిదండ్రులు.. ఆమె మ‌ృతితో గుండె పగిలేలా విలపించారు. తమ కూతురు పెద్ద ఆశయంతో ఉండేదని, ఆమెతో పాటు ఆ ఆశయం కూడా చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తండ్రి నరేందర్‌ ఆరోపించారు. ప్రీతికి ఎవరో ఇంజక్షన్‌ ఇచ్చారని, ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రీతి మరణానికి గల కారణాలు తెలపాలన్నారు.

సెకండ్ ఇయర్ విద్యార్థి సైఫ్ తనను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులకు ప్రీతి ఫిబ్రవరి 18న చెప్పింది. ప్రీతి ఆత్మహత్యయత్నం చేసుకున్న రోజు రాత్రి విధుల్లో ఉంది. తెల్లవారుజామున 3 గంటల వరకు డ్యూటీ చేసింది. అనంతరం ఆత్మహత్యకు యత్నించింది.(Medico Preethi Case)

Also Read..Abdullapurmet Naveen Case : హరిహరకృష్ణలో కనిపించని పశ్చాత్తాపం, చట్టంలో లొసుగులే బయటకు తీసుకొస్తాయని ధీమా

ఆత్మహత్యకు యత్నించే కంటే ముందు ప్రీతి తన తల్లితో మాట్లాడింది. సైఫ్ తనతో పాటు చాలా మంది జూనియర్లని వేధిస్తున్నాడని వాపోయింది. సీనియర్లు అంతా ఒకటేనని చెప్పింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని తల్లితో మొర పెట్టుకుంది. తాను సైఫ్‎పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటైపోయి తనను ఏం చేస్తారో అంటూ కన్నీటిపర్యంతమైంది.