Viral Video : మహిళలూ బీకేర్ ఫుల్.. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళకు ఊహించని షాక్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Shocking : ఈ ఘటన మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. మహిళలు మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు పోలీసులు.

Viral Video : మహిళలూ బీకేర్ ఫుల్.. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళకు ఊహించని షాక్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Chain Snatch(Photo : Google)

Updated On : May 18, 2023 / 11:01 PM IST

Chain Snatching Incident : మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఇల్లు దాటి బయటకు వచ్చారంటే ఇంకాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఊహించని ఘోరం జరిగిపోతోంది. అందుకే, చాలా చాలా కేర్ ఫుల్ గా ఉండాలి.

ఇకపోతే చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు బైక్ ల మీద వచ్చిన కేటుగాళ్లు.. ఇప్పుడు కొత్తగా కార్లలోనూ వచ్చి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. తమిళనాడు కోయంబత్తూరులో షాకింగ్ ఘటన జరిగింది. చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కారులో వచ్చిన కంత్రీగాళ్లు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి చైన్ లాక్కునేందుకు ప్రయత్నించడం తీవ్ర సంచలనం రేపింది.

Also Read..Viral Video : బాబోయ్.. ప్రతీకారం తీర్చుకున్న గాడిద.. తనను తీవ్రంగా కొట్టి హింసించిన యువకుడికి ఆ గాడిద ఎలా బుద్ధి చెప్పిందో చూడండి

రోడ్డుపై ఓ మహిళ మార్నింగ్ వాక్ చేస్తోంది. రోడ్డు పక్కగా ఆమె నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె వెనకాలే చైన్ స్నాచర్లు కారులో ఫాలో అయ్యారు. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి కారు డోర్ లో నుంచి చెయ్యి బయటకు పెట్టి మహిళ మెడలోని చైన్ లాగేందుకు ప్రయత్నం చేశాడు. అయితే, ఆమె ప్రతిఘటించింది. తన చైన్ ను గట్టిగా రెండు చేతులతో పట్టుకుంది. ఈ క్రమంలో ఆమె కిందపడిపోయింది. అలాగే ఆమెను రోడ్డుపై కొంతదూరం లాక్కెళ్లారు. కానీ, చైన్ మాత్రం తెంపలేకపోయారు.

వాళ్లతో తీవ్రంగా పెనుగులాడిన మహిళ తన చైన్ ను కాపాడుకుంది. దీంతో స్నాచర్లు ఆమెను వదిలేసి కారులో పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

ఏకంగా కారులో వచ్చి చైన్ స్నాచింగ్ కు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. మహిళలు మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు పోలీసులు. మెడలో గోల్డ్ చైన్లు ఉంటే.. వాటిని భద్రంగా కప్పుకోవాలని సూచిస్తున్నారు.

Also Read..Viral Video : మనిషేనా? చెల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించి వీడియో తీసిన సోదరుడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో