Men Molested Girl : నెల్లూరు జిల్లాలో యువతిపై దాడి చేసిన శాడిస్టులు అరెస్ట్

నెల్లూరు జిల్లాలో నిర్జన ప్రదేశంలో ఒక యువతిపై దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Men Molested Girl : నెల్లూరు జిల్లాలో యువతిపై దాడి చేసిన శాడిస్టులు అరెస్ట్

Nellore Venkatesh

Updated On : September 15, 2021 / 3:29 PM IST

Men Molested Girl : నెల్లూరు జిల్లాలో నిర్జన ప్రదేశంలో ఒక యువతిపై దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి యువతిని  చెంపపై కొడుతూ, కర్రతో కొడుతూ అసభ్య పదజాలంతో  దూషిస్తూ  పిడిగుద్దులు గుద్దుతూ హింసిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆయువతి వదిలేయమని ఎంత ప్రాధేయపడినా యువతిని హింసిస్తూ దానిని మరో ఫ్రెండ్ తో వీడియో తీయించాడు.  అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈక్రమంలో కేసు  నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

నెల్లూరు జిల్లా రామకోటయ్యనగర్ కు   చెందిన ఉష అనే యువతి పట్ల వెంకటేష్ అనే వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. వెంకటేష్‌ను నమ్మి నిర్జన ప్రదేశానికి వెళ్లిన  ఉషను కర్రతో, చేతులతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె గాజులు పగిలి.. రక్తం కారుతూ..వదిలేయమని ప్రాధేయపడినా కనికరం చూపలేదు. ఈ అమానుషాన్నంతా తన మిత్రుడితో వీడియో తీయించి పైశాచికానందాన్ని పొందాడు.
Read Also : Saidabad Girl Rape Case : సైదాబాద్ రేప్ కేసు నిందితుడి పై రూ.10లక్షలు నజరానా
ఈవీడియో  వైరల్  కావటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మొదట కలువాయి  ప్రాంతంలో వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన  సమాచారంతో స్నేహితుడు శివకుమార్‌ను  కూడా అదుపులోకి తీసుకున్నారు. శివకుమార్ పాతనేరస్ధుడేనని అతనిపై గతంలో కేసులు  ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.