Section 66-A : సెక్షన్ 66-ఏ కింద కేసులన్నీ ఎత్తివేసిన కేంద్రం

కేంద్ర హోంశాఖ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది.  సెక్షన్ 66-ఏ   ఐటీ చట్టం కింద నమోదైన కేసులన్నిటినీ ఎత్తి వేసింది.  ఈ మేరకు కేంద్ర పాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు  ఆదేశాలు జారీ చేసింది. 

Section 66-A : సెక్షన్ 66-ఏ కింద కేసులన్నీ ఎత్తివేసిన కేంద్రం

Ministry Of Home Affairs Key Decession

Updated On : July 14, 2021 / 8:35 PM IST

Section 66-A  : కేంద్ర హోంశాఖ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది.  సెక్షన్ 66-ఏ   ఐటీ చట్టం కింద నమోదైన కేసులన్నిటినీ ఎత్తి వేసింది.  ఈ మేరకు కేంద్ర పాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు  ఆదేశాలు జారీ చేసింది.  ఇక నుంచి 66-ఏ సెక్షన్ కింద కొత్త కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. ఈ చట్టాన్నిరద్దు చేసినా కొన్ని  రాష్ట్రాలు ఈచట్టంపై  సుప్రీం కోర్టుకు వెళ్లటంపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని కేంద్రం గతంలోనే  రద్దు చేయగా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో తాజాగా  కేంద్రం ఈ ఆదేశాలు  జారీ చేసింది.

ఐటీ చట్టంలోని సెక్షన్ 66-ఏ ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు 2015 లో తీర్పు చెప్పింది.  తీర్పు వచ్చి ఆరేళ్లు కావస్తున్నా  కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కేసులు నమోదు కావటంతో సుప్రీం కోర్టు ఇటీవల కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీం కోర్టు నోటీసులతో కేంద్రం ఈరోజు తాజా ఆదేశాలు జారీ చేసింది. 2015 తర్వాత ఈసెక్షన్ కింద 11 రాష్ట్రాల్లో 1307 పైగా కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగాకేసులు ఉన్నాయి.