Uttar Pradesh : ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన మత గురువు
ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. చదువుకోటానికి వచ్చిన బాలికపై ఒక మత గురువు అత్యాచారం చేసాడు.

Uttar Pradesh Rape
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. చదువుకోటానికి వచ్చిన బాలికపై ఒక మత గురువు అత్యాచారం చేసాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
సంభాల్ జిల్లాలో చదువుకునేందుకు మత పాఠశాలకు వచ్చిన బాలికపై మంగళవారంనాడు మసీదుకు చెందిన గురువు ఒకరు అత్యాచారం చేశారు. నిందితుడు పాఠశాలకు చెందిన మసీదులో మత బోధనలు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు.
బాలిక తల్లి ఫిర్యాదు చేయటంతో పోలీసులు బుధవారం నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సంభాల్ పోలీసు సూపరిటెండెంట్ చక్రేష్ మిశ్రా తెలిపారు.
Also Read :Praveen Nettar Murder : బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్