Love Affair Murder : ప్రేమించలేదని బాలికను పొడిచి చంపిన ఉన్మాది

వెంటపడి ప్రాధేయపడినా ప్రేమించటం లేదన్న కక్షతో 14 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపాడో ఉన్మాది.

Love Affair Murder : ప్రేమించలేదని బాలికను పొడిచి చంపిన ఉన్మాది

Maharashtra Love Murder

Updated On : October 13, 2021 / 1:36 PM IST

Love Affair Murder : వెంటపడి ప్రాధేయపడినా ప్రేమించటం లేదన్న కక్షతో 14 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపాడో ఉన్మాది. మహారాష్ట్రలోని పూణే లోని బిబేవాడి ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక 8వ తరగతి చదువుతోంది. బాలికకు దూరపు బంధువైన 22 ఏళ్ల యువకుడు బాలికను గత కొన్నాళ్లుగా ప్రేమించమని వెంటపడి వేధించసాగాడు.

Also Read : Power Crisis : భూపాలపల్లి పై కేంద్ర ప్రభుత్వం కన్ను
అయినా ఆబాలిక ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన యువకుడు మంగళవారం సాయంత్రం కబడ్డీ ప్రాక్టీస్ కు వెళుతుండగా… మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్ పై వచ్చి బాలికను అడ్డగించాడు. ముగ్గరూ కలిసి బాలికను విచక్షణా రహితంగా కత్తితో పొడిచి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. సమచారం తెలుసుకుని ఘటనాస్ధలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.