దారుణ ఘటన.. డ్రైనేజీలో శవమై కనిపించిన తొమ్మిదేళ్ల బాలిక
తొమ్మిదేళ్ల పసిపాప శవం డ్రైనేజీలో దారుణ స్థితిలో బయటపడడంతో ముత్యాలపేట వాసులు రగిలిపోయారు.

Puducherry Girl: మరో దారుణం.. తొమ్మిదేళ్ల పసిపాప కామాంధుల శాడిజానికి బలైపోయింది. లైంగిక దాడికి గురై దారుణ స్థితిలో డ్రైనేజీలో శవమై కనిపించింది. పుదుచ్చేరిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం రోడెక్కారు. బాలికపై దాష్టీకానికి పాల్పడిని కామాంధులకు కఠిన శిక్ష విధించాలని ఎక్కడిక్కడ ఆందోళనలు చేపట్టారు. దీంతో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్న్ తమిళసై సౌందరరాజన్ స్పందించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వారం రోజుల్లో న్యాయం జరిగేలా చూస్తామని హామీయిచ్చారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
అసలేం జరిగింది?
తమ కుమార్తె కనిపించడం లేదని పుదుచ్చేరి ముత్యాలపేటకు చెందిన దంపతులు ఈనెల 2న స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేశారని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అయితే 4 రోజులు గడిచినా బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం అంబేడ్కర్ నగర్ గోశాల వెనకున్న డ్రైనేజీలో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాళ్లు చేతులు కట్టేసి, నోటిలో గుడ్డలు కుక్కినట్టు మృతదేహం బయటపడడంతో ముత్యాలపేట వాసులు రగిలిపోయారు. బాలికపై లైంగిక దాడి చేసి, హత్య చేశారని తెలియడంతో ఆగ్రహావేశాలతో ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై పుదుచ్చేరి వాసులు ముక్తకంఠంతో ఖండించారు. కిరాతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టడంతో పుదుచ్చేరి అట్టుడికిపోయింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది.
Also Read: నిజాంపేట ఘటన మరకముందే.. బాచుపల్లిలో దుండగుల హల్ చల్
సీఎం రంగస్వామి హామీ
ముత్యాలపేట ఘటనపై సీఎం రంగస్వామి, హోంమంత్రి నమశ్శివాయం స్పందించారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించి 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. హంతకులను చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీయిచ్చారు. కాగా, ఈ కేసులో వివేకానంద(59), కరుణాస్(19) అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజనులు నినదిస్తున్నారు.
Also Read: అతడి ఆచూకీ చెబితే.. రివార్డుగా రూ.10 లక్షల క్యాష్.. ఎవరతను?
ఖండించిన సెలబ్రిటీలు
ముత్యాలపేట ఘటనపై తమిళ సినీమా అగ్ర నటులు కమల్ హాసన్, విజయ్, శరత్ కుమార్, కుష్భూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలిక మృతి పట్ల సంతాపం ప్రకటించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.