Devaragattu Banni Utsavam : దేవరగట్టులో 100 మందికి గాయాలు… నలుగురి పరిస్థితి విషమం

కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఆలయం లో నిన్న రాత్రి జరిగిన దసరా బన్ని జైత్రయాత్ర జరిగింది. ఈ ఉత్సవంలో చెలరేగిన హింసలో సుమారు వందమందికి పైగా గాయాలయ్యాయి.

Devaragattu Banni Utsavam : దేవరగట్టులో 100 మందికి గాయాలు… నలుగురి పరిస్థితి విషమం

Devaragattu Banny utsavam

Updated On : October 16, 2021 / 7:57 AM IST

Devaragattu Banny Utsavam :  కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఆలయం లో నిన్న రాత్రి జరిగిన దసరా బన్ని జైత్రయాత్ర జరిగింది. ఈ ఉత్సవంలో చెలరేగిన హింసలో సుమారు వందమందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో నలుగురిపరిస్థితి విషమంగా ఉంది. 73 మందికి తలలు పగిలాయి.  గాయపడిన వారిని ఆదోనిలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విధించిన ఆంక్షలు బేఖాతరు చేస్తూ 24 గ్రామాల ప్రజలు…భక్తి, విశ్వాసం పేరుతో ఈ ఉత్సవంలో పాల్గోన్నారు. ఓ వర్గం వారిని మరో వర్గం అడ్డుకోవడం, ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకోవటం వల్ల ఎంతో మందికి తీవ్రగాయాలై మరణించిన ఘటనలూ ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అధికారులు చేపట్టిన చర్యలు ఫలించలేదు.

దేవరగట్టులో కొండపై ఉన్న మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిన్న రాత్రి 12 గంటలకు స్వామి వారి కళ్యాణం జరిపారు. అనంతరం స్వామి వారిని ఊరేగిస్తారు. ఉత్సవ మూర్తులను మేళతాళాలతో కొండదిగువున సింహసన కట్టవద్దకు చేరుస్తారు అక్కడే అసలు కధ స్టార్ట్ అవుతుంది. స్వామి మూర్తులను దక్కించుకోటానికి నెరణిఖి, నెరణికి తండా, కొత్తపేటకు చెందిన గ్రామాల భక్తులు ఒకవైపు, అరికెర, అరికెరతండా,సుళువాయి,ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్ విరుపాపురం తదితర గ్రామల భక్తులు మరోవైపు మొహరించి కర్రలతో తలపడి స్వామి వారిని దక్కించుకుంటారు.

ఈసారి ఐరన్ రింగులు తొడిగిన కర్రలతో గ్రామస్తులు తలపడటానికి సిధ్దమవ్వగా పోలీసులు అటువంటి సుమారు 500 కర్రలనుస్వాధీనం చేసుకున్నారు. ఉత్సవాల్లో అల్లరకుపాల్పడతారని అనుమానిస్తున్న 160 మందిని మూడు రోజులముందుగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవరగట్టులో 20 పడకల ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేశారు.