Uttar Pradesh: 5 రోజుల పసికందుపై కన్నతల్లి పైశాచికం.. పాలు తాగకపోతే అలా చేస్తారా?
బారాబంకీ జిల్లా ఫతేపూర్ ప్రాంతంలోని ఇస్రౌలి అనే గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా బానో దంపతులకు ఈ నెల 11న ఒక మగపిల్లాడు పుట్టాడు. ఫతేపూర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవం జరిగింది. చిన్నారి మొదటి మూడు, నాలుగు రోజులు ఆరోగ్యంగానే ఉంది. అయితే ఉన్నట్టుండి పాలు తాగకపోవడంతో తల్లి ఆసియా తీవ్ర ఆందోళను గురైంది

Barabanki: పిల్లలంటే ఏ తల్లికైనా పంచప్రాణాల కంటే ఎక్కువే. వారికి చిన్న గాయం తగిలినా తల్లి గుండె విలవిలలాడిపోతుంది. అలాంటిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ ఐదు రోజుల పసిబిడ్డ చేతులను వేడి వేడి నూనెలో ముంచింది. నిజానికి ఆమె కోపంతో ఈ పని చేయలేదు. బిడ్డ పాలు తాగడం లేదని ఆందోళనకు గురైన ఆమె.. ఎవరో ఇచ్చిన ఆ దిక్కుమాలిన, మూర్ఖపు, మూఢనమ్మకు సలహాను నమ్మి తన బిడ్డ చేతులు కాల్చుకుంది. పైగా ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో జరగడం మరో విశేషం.
రాష్ట్రంలోని బారాబంకీ జిల్లా ఫతేపూర్ ప్రాంతంలోని ఇస్రౌలి అనే గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా బానో దంపతులకు ఈ నెల 11న ఒక మగపిల్లాడు పుట్టాడు. ఫతేపూర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవం జరిగింది. చిన్నారి మొదటి మూడు, నాలుగు రోజులు ఆరోగ్యంగానే ఉంది. అయితే ఉన్నట్టుండి పాలు తాగకపోవడంతో తల్లి ఆసియా తీవ్ర ఆందోళను గురైంది. ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇంతలో ఆసుపత్రి సిబ్బంది ఒకరు ఆమెకు ఒక మూర్ఖమైన సలహా ఇచ్చారు.
Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. అల్లర్లు ఎందుకు ఆగడం లేదు?
కానీ, తన బిడ్డ మీద తీవ్ర ఆందోళనలో ఉన్న ఆసియా.. అంతగా ఆలోచించకుండా ఆసుపత్రి సిబ్బందిలో ఆ వ్యక్తి ఇచ్చిన సూచన మేరకు చిన్నారి వేళ్లను కాలుతున్న నూనెలో ముంచింది. రాత్రి విధుల్లో ఉన్న నర్సు ఇది గమనించి వెంటనే వైద్యుడికి సమాచారం అందించింది. ఆసియా వార్డుకు చేరుకున్న వైద్యుడు.. చిన్నారికి వైద్యం చేసి ఆసియాపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అయితే గతంలో ఇలాగే పిల్లలు పాలు తాగక ఇద్దరు బిడ్డల్ని కోల్పోయింది ఆసియా. ఆ భయంతోనే ఇలా చేసిందని పోలీసుల విచారణలో తేలింది.