Meerut Incident: అబ్బాయితో మాట్లాడుతోందని కన్నతల్లే కూతురిని చంపేసింది.. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఏం చేసిందంటే..
మృతదేహంపై ఉన్న దుస్తులు ఈ కేసులో మిస్టరీని చేధించాయి. హంతకులను పట్టించాయి.

Meerut Incident: ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో దారుణం జరిగింది. అబ్బాయితో మాట్లాడుతోందని కూతురిని కన్న తల్లే కడతేర్చింది. అతి కిరాతకంగా చంపేసింది. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు తలను వేరు చేసింది. డెడ్ బాడీని, తలను వేర్వేరుగా కెనాల్ లో పడేసింది. అయితే, స్థానిక రైతు కెనాల్ లో మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ దారుణం వెలుగు చూసింది.
ఆ అమ్మాయి పేరు ఆస్తా. వయసు 17 ఏళ్లు. మీరట్ లోని పర్తాపూర్ ప్రాంతంలో కెనాల్ లో శవమై కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టగా విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆ అమ్మాయిని కన్న తల్లే కడతేర్చినట్లు విచారణలో బయటపడింది. తన కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది.
పోలీసులు రాకేశ్ దేవి, మోను, కమల్ సింగ్, సమర్ సింగ్, ఒక మైనర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఆస్తా తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంగా.. ఆమె తల్లి చూసింది. అంతే కోపంతో ఊగిపోయింది. కుటుంబసభ్యులతో కలిసి కూతురి గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత బోల్ట్ కట్టర్ తో తలను వేరు చేసింది. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు ఆమె ఈ ఖతర్నాక్ ప్లాన్ వేసింది. తలను వేరు చేస్తే మృతదేహాన్ని ఎవరూ గుర్తించలేరని అనుకుంది.
పక్కా ప్లాన్ ప్రకారం తలను గంగా కెనాల్ లో, శరీరాన్ని బహదూర్ పుర కెనాల్ లో పడేసింది. అయితే, మృతదేహంపై ఉన్న దుస్తులు ఈ కేసులో మిస్టరీని చేధించాయి. హంతకులను పట్టించాయి. మృతదేహాన్ని ఓ వస్త్రంలో చుట్టి కెనాల్ లో పడేసింది రాకేశ్ దేవి. ఆ తప్పే ఆమెను పట్టించింది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇంకా తల దొరకలేదు. కూతురిని కన్న తల్లే అతి కిరాతకంగా చంపేసిందన్న వార్త స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులకు దొర్కకుండా ఉండేందుకు ఆమె చేసిన పని భయబ్రాంతులకు గురి చేసింది.