Tragic Incident: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఘోరం.. రైలు కింద పడి నవవరుడు దుర్మరణం… హనీమూన్ కోసం గోవాకు వెళ్తుండగా..

వరంగల్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చారు. అంతా కలిసి గోవా వెళ్లే వాస్కోడి గామా రైలు ఎక్కారు.

Tragic Incident: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఘోరం.. రైలు కింద పడి నవవరుడు దుర్మరణం… హనీమూన్ కోసం గోవాకు వెళ్తుండగా..

Updated On : June 7, 2025 / 10:38 PM IST

Tragic Incident: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఘోరం జరిగింది. నవవరుడు రైలు కిందపడి చనిపోయాడు. పెళ్లి జరిగి మూడు నెలలైంది. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది. మృతుడిని వరంగల్ కు చెందిన ఊరకొండ సాయిగా గుర్తించారు. సాయి(28) హనీమూన్ కోసం గోవా టూర్ కి ప్లాన్ చేశాడు. భార్య మాధురి, బావమరిది, తన ముగ్గురు ప్రెండ్స్ తో సాయి గోవాకి వెళ్లేందుకు వరంగల్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అంతా కలిసి గోవా వెళ్లే వాస్కోడి గామా రైలు ఎక్కారు.

వాటర్ బాటిల్ కోసం సాయి రైలు దిగాడు. ఇంతలోనే ట్రైన్ కదిలింది. సాయి బయటే ఉండిపోయాడు. దీంతో అతడి ఫ్రెండ్స్.. రైలుని ఆపేందుకు స్టాప్ చైన్ లాగారు. స్టాప్ చైన్ లాగిన విషయం తెలుసుకుని ఆర్పీఎఫ్ పోలీసులు అక్కడికి వచ్చారు. సాయి స్నేహితులను వారు రైలు నుంచి కిందకు దించి విచారించారు. చైన్ లాగడం తప్పే అని ఫైన్ కడతామని వారు అంటుండగా.. మళ్ళీ రైలు కదిలింది.

Also Read: 40రోజుల క్రితమే కొత్త ఇంట్లోకి వెళ్లిన వృద్ధ దంపతులు, ఇంతలోనే దారుణం జరిగిపోయింది.. అసలేం జరిగింది?

తన భార్య, బావమరిది రైలులోనే ఉండటంతో సాయి కంగారుపడ్డాడు. కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ట్రైన్, ప్లాట్ ఫామ్ మధ్యలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు. సాయిని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

నవవధువు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు జీఆర్పీ పోలీసులు. మూడు నెలల క్రితమే పెళ్లి జరగ్గా.. ఇంతలోనే నవ వరుడు దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. భార్య, సాయి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోవాకు వెళ్లి హనీమూన్ ని ఎంజాయ్ చేద్దామని సాయి అనుకుంటే.. విధి అతడితో మరో ఆట ఆడింది.