మైనర్ బాలికపై అత్యాచారం,జైలు శిక్ష – బిడ్డ పుట్టాక పెళ్లికి బెయిలిచ్చిన కోర్టు

మైనర్ బాలికపై అత్యాచారం,జైలు శిక్ష – బిడ్డ పుట్టాక పెళ్లికి బెయిలిచ్చిన కోర్టు

Updated On : January 29, 2021 / 5:48 PM IST

Mumbai POCSO Court Grants Bail To Accused, After He Offers To ‘Marry’ 16-Year-Old Girl He Impregnated : మైనర్ బాలికపై అత్యాచారం చేశాడో వివాహితుడు. బాలిక గర్భం దాల్చి నేరం రుజువు కావటంతో జైలు పాలయ్యాడు. బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో ముంబై లోని పోక్స్ కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. కూతురుపై అత్యాచారం చేశాడని పిర్యాదు చేసిన తల్లే, ఇప్పుడు నిందితుడికి బెయిల్ మంజూరు చేయమని పిటీషన్ దాఖలు చేయటం విశేషం.

ముంబైకు చెందిన 25 ఏళ్ల యువకుడు తన స్నేహితుడి కుమార్తెపై (16) కన్నేశాడు. వాళ్లింటికి వచ్చిపోయే క్రమంలో ఆమెను మాయమాటలతో  లోబరుచుకున్నాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి…. ఆమెతో సన్నిహితంగా మెలిగి ఆమెపై లైంగిక దాడి చేశాడు. కొన్నాళ్లకు బాలిక గర్భం దాల్చింది. ఆమె కడుపులో పెరిగే బిడ్డకు తాను తండ్రిగా ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించాడు.

కాలక్రమంలో బాలిక శరీరంలో మార్పులు రావటంతో కుటుంబ సభ్యులు నిలదీశారు, దీంతో బాలిక జరిగిన విషయం చెప్పింది. తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అత్యాచారం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని గతేడాది అక్టోబర్ 23న అరెస్ట్ చేశారు. కోర్టులో సాక్ష్యాలు నిరూపించటంతో లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ కల్పించే ప్రత్యేక కోర్టు (పోక్సో) నిందితుడికి జైలు శిక్ష విధించింది. ఈలోగా బాలికకు డెలివరీ అయి బిడ్డకు జన్మనిచ్చింది. రిమాండ్ లో ఉండగా నిందితుడు పెట్టుకున్న బెయిల్ పిటీషన్లను కోర్టు కొట్టి వేసింది,

కాగా….బాలిక మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వటంతో బాలిక తల్లి ఇటీవల నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్ దాఖలు చేసింది. పిటీషన్ విచారించిన పోక్సో కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. అయితే నిందితుడికి బెయిల్ మంజూరు చేయటాన్ని పోలీసులు వ్యతిరేకించారు. మైనర్ బాలికను మాయ మాటలతో పెళ్లి చేసుకోటానికి ప్రయత్నస్తున్నాడని, నిందితుడి రెండో వివాహానికి అతడి మొదటి భార్య అంగీకరించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వాదించారు.

కాగా.. నిందితుడి మొదటి వివాహం గురించి తెలియదని చెప్పలేం.. మైనర్‌కు 18 ఏళ్లు నిండితన తర్వాత అతడు వివాహం చేసుకోవాలని భావిస్తున్నాడు…ఆమె కూడా అతడిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతోంది….ఈ వ్యవహారం ఏకాభిప్రాయ సంబంధానికి సంబంధించినది..కనుక నిందితుడిని ఈ సమయంలో నిర్బంధంలో ఉంచాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించి బెయిల్ మంజూరు చేశారు.