Two Marriages : రెండు రోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు

నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఒక యువకుడు రెండు రోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వీటిలొ ఒకటి రహస్యంగా చేసుకోగా.... ఇంకోకటి సీక్రెట్‌గా చేసుకున్నాడు.

Two Marriages : రెండు రోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు

Marriage Cheating

Updated On : December 7, 2021 / 9:33 AM IST

 

Two Marriages :  సమాజంలో పెళ్లి పేరుతో జరిగే మోసాలు విచిత్రంగా ఉంటాయి. కొంతమంది 40 ప్లస్  వయసు వచ్చినా పెళ్లి కాలేదని బాధపడుతుంటే కొంత మంది ప్రబుద్ధులు ఆ వయస్సుకే  రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు పెడుతుంటారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఒక యువకుడు రెండు రోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వీటిలొ ఒకటి రహస్యంగా చేసుకోగా…. ఇంకోకటి సీక్రెట్‌గా చేసుకున్నాడు.

తాడూర్ మండలం ఆకునెల్లి కుదురుకు చెందిన వంగశేఖర్ గౌడ్ అనే యువకుడు హైదరాబాద్‌లో ఉంటూ ఆమెను ప్రేమ పేరుతో శారీరకంగా లొంగదీసుకుని గత నెల 10వ తేదీన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులోని ఒక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.

అనంతరం గత నెల 12వ తేదీన..మొదటి వివాహం విషయం దాచి పెట్టి పెద్దలు కుదిర్చిన ఖమ్మం జిల్లా ఊర్కొండ కు  చెందిన యువతిని సాంప్రదాయబధ్ధంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య ఆర్భాటంగా వివాహం చేసుకున్నాడు. వారం తర్వాత  ఈవిషయం తెలుసుకున్న మొదటి భార్య హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read : Sexual Assault : ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళపై లైంగిక దాడి చేసిన ఎస్సై
సరూర్‌నగర్  పోలీసులు శేఖర్ గౌడ్‌కు  సమాచారం ఇచ్చి  కేసు విషయం మాట్లాడటానికి పోలీసు స్టేషన్‌కు  రమ్మని పిలిచారు. ఇంట్లో వనపర్తికి   వెళుతున్నానని చెప్పి శేఖర్ గౌడ్ … సరూర్‌నగర్ పోలీసు‌స్టేషన్‌కు  బయలుదేరి  వచ్చాడు. శేఖర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన రెండో భార్య బాబాయ్, కుటుంబ సభ్యులతో  శేఖర్‌ను  అనుసరించి వచ్చాడు.

సరూర్‌నగర్ పోలీసు‌స్టేషన్‌లో  రెడ్‌హ్యాండెడ్‌గా మొదటి భార్యతో కలిసి పట్టుకున్నారు. అక్కడే అన్ని విషయాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు శేఖర్‌గౌడ్, అతని కుటుంబ సభ్యులపై వారి గ్రామమైన ఖమ్మం జిల్లా ఊర్కోండ   పోలీసు‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.