గొంతుమార్చి మాట్లాడి రూ.36 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

గొంతుమార్చి మాట్లాడి రూ.36 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

Updated On : December 25, 2020 / 3:51 PM IST

negerian cheated Rs.36 lakhs, fake messanger call looting : ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా గొంతుమార్చి మాట్లాడి చెన్నైకి చెందిన   వ్యాపారస్తుడి వద్ద నుంచి రూ.36 లక్షలు మోసగించిన నైజీరియన్ ను పోలీసులు  గుర్తించారు.  చెన్నై కీల్పాక్కం కి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి(48) అనే వ్యక్తి రాయల్ ట్రేడింగ్ అనే సంస్ధను నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం తన ఫేస్ బుక్ పేజీలో వ్యాపార వివరాలను నింపాడు.  అతని వ్యాపార వివరాలు చూసిన లండన్ కు చెందిన ఎలిజబెత్ అనే మహిళ మెసెంజర్ ద్వారా జోసెఫ్ తో పరిచయం పెంచుకుంది.

మెసెంజర్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకోవటం మొదలెట్టారు. ఈ క్రమంలో ముంబైలో రక్త క్యాన్సర్  నయం చేసే ఫోలిక్ ఆయిల్ దొరుకుతుందని….. దాన్ని కొని పంపిస్తే డబ్బుచెల్లిస్తానని చెప్పింది. ఈ డీల్ లో రూ.36 లక్షలు ఫోలిక్ ఆయిల్ పంపిస్తే రూ. 6లక్షలు కమీషన్ గా ఇస్తానని ఆశ చూపించింది.  వ్యాపారంలో కమీషన్ వస్తుందనే సరికి జోసెఫ్ అందుకు ఒప్పుకున్నాడు.

అయితే సునీత అనే మహిళతో మాట్లాడి పంపాలని ఎలిజబెత్ సునీత వివరాలు ఇచ్చింది. జోసెఫ్ సునీతతో మెసెంజర్ ద్వారా మాట్లాడాడు. తన అకౌంట్ కు రూ. 36 లక్షలు జమ చేస్తే మీరు చెప్పిన అడ్రస్ కు ఫోలిక్ ఆయిల్ డెలివరీ ఇస్తానని సునీత మెసెంజర్ లో చెప్పటంతో జోసెఫ్ రూ.36  లక్షలు సునీత చెప్పిన  ఎకౌంట్ కు పంపించాడు.

అనంతరం సరుకు డెలివరీ విషయమై విచారించటానికి వారిచ్చిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయగా రెండూ స్విచ్చాఫ్ చేసి ఉండటంతో మోసపోయానని గ్రహించాడు. వెంటనే చెన్నై పోలీసు కమీషనరేట కార్యాలయంలో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారించి…ముంబైలో మోసం జరిగినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.