బోటు డ్రయివర్లు ఎక్కడ ? …బతికి ఉన్నారా ? లేదా ?  

  • Published By: chvmurthy ,Published On : September 20, 2019 / 12:57 PM IST
బోటు డ్రయివర్లు ఎక్కడ ? …బతికి ఉన్నారా ? లేదా ?  

Updated On : September 20, 2019 / 12:57 PM IST

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద ఆరు రోజుల క్రితం జరిగిన బోటు ప్రమాదంలో డ్రయివర్లు బతికే ఉన్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. డ్రైవర్లు నూకరాజు, సత్యనారాయణ చనిపోయారన్న వార్త నిజం కాదన్న అనుమానాలు గట్టిగా వ్యక్తమవుతున్నాయి.  

ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్లు ముందే బోటు నుంచి దూకి తప్పించుకున్నట్లు కొందరు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఇన్ని మృతదేహాలు బయటపడ్డా డ్రైవర్ల మృతదేహాలు మాత్రం దొరకలేదు. ఆరు రోజులుగా వారి ఆచూకీ లేదు. దీంతో ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నది నిజమే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

డ్రైవర్లు కూడా మునిగిపోయిన బోటు కింద ఉండి ఉండొచన్న మరో అనుమానం ఉన్నప్పటికీ…. ప్రమాదాన్ని ముందే డ్రైవర్లు పసిగట్టే అవకాశాలే ఎక్కువ ఉంటాయని… అలాంటప్పుడు వారు ఇరుక్కుపోయే అవకాశం లేదని అనుభవం ఉన్నవాళ్లు చెబుతున్నారు.  పోలీసులు, కేసులకు, భయపడి  డ్రైవర్లు నూకరాజు, సత్యనారాయణ బతికే ఉండి అజ్ఞాతంలో ఉండి ఉండవచ్చని స్ధానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.