5 ఏళ్ల ప్రేమ….పెళ్లైన మూడు రోజులకే పెళ్లాని వదిలేసి పారిపోయిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్

అయిదేళ్లపాటు ప్రేమించుకుని ఇంట్లో పెద్దలనెదిరించి పెళ్ళి చేసుకున్న ప్రేమజంట. ఇంతలో ఏమైందో ఏమో పెళ్లైన మూడోరోజ నుంచి భర్త కనిపించకుండా పోయేసరికి ఆ యువతి తనకు న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించింది.

5 ఏళ్ల ప్రేమ….పెళ్లైన మూడు రోజులకే పెళ్లాని వదిలేసి పారిపోయిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్

Updated On : March 12, 2021 / 11:22 AM IST

Newly married husband missing after two days of marriage : అయిదేళ్లపాటు ప్రేమించుకుని ఇంట్లో పెద్దలనెదిరించి పెళ్ళి చేసుకున్న ప్రేమజంట. ఇంతలో ఏమైందో ఏమో పెళ్లైన మూడోరోజ నుంచి భర్త కనిపించకుండా పోయేసరికి ఆ యువతి తనకు న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించింది.

కర్ణాటకలోని బెంగుళూరు రూరల్ జిల్లా హౌసకొటె తాలూకాలోని నందగుడి లో నివాసం ఉండే ప్రమోద్, అనూజ అయిదేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ప్రమోద్ సీఆర్పీఎఫ్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. వీరి పెళ్లికి ఇరువైపులా ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు.
crpf constibale
పెద్దలనెదరించి వీరిద్దరూ ఫిబ్రవరి 19న బెంగుళూరు ఎలహంక లోని సీఆర్పీఎప్ క్యాంపులో పెళ్లి చేసుకున్నారు. మూడురోజుల పాటు ఆమెతో ఉన్న ప్రమోద్ నాలుగో రోజునుంచి కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత అతని ఫోన్ కూడా స్విచ్చాఫ్ అయ్యింది. భర్త గురించి ఎంక్వయిరీ చేయగా ప్రమోద్ మరో పెళ్లికి సిధ్ద మవుతున్నట్లు తెలుసుకున్న అనూజ నందగుడి పోలీసు స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులతో ధర్నాకి దిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు