దిశ నిందితుల ఎన్ కౌంటర్ : చటాన్‌‌పల్లికి NHRC టీం

  • Published By: madhu ,Published On : December 7, 2019 / 01:05 AM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్ : చటాన్‌‌పల్లికి NHRC టీం

Updated On : December 7, 2019 / 1:05 AM IST

చటాన్‌పల్లిలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసింది. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం సభ్యులు 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ ప్రదేశాన్ని సందర్శించనున్నారు. అనంతరం మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో దిశ కేసు నిందితుల మృతదేహాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. 

ఇక దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై దేశమంతా వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఈ ఎన్ కౌంటర్ పై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మంచి పని చేశారని, నిందితులకు సరైన శిక్ష పడిందని ఆనందపడుతున్నారు. అయితే ఈ ఎన్ కౌంటర్ పై కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోంశాఖ ఎన్ కౌంటర్ పై తెలంగాణ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను రిపోర్ట్ చేయాలని తెలిపింది.

* దిశ హత్యాచార నిందితులను పోలీసులు 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్‌ చేశారు. 
* షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. 
* నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. 
* 2019, నవంబర్ 27వ తేదీన దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేశారు. 
* అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గర కాల్చివేశారు. 
* ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులుగా గుర్తించారు.
* దిశ కేసులో నిందితులను గురువారం 2019, డిసెంబర్ 5వ తేదీన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.